పోర్న్ బ్యాన్, వెబ్ అడ్రస్‌ను ఛేంజ్ చేసిన పోర్న్‌హబ్!
అశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేస్తూ హైకోర్ట్ ఉత్తర్వుల జారీ చేసిన నేపథ్యంలో ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ జియో , 800లకు పైగా పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.
అశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేస్తూ హైకోర్ట్ ఉత్తర్వుల జారీ చేసిన నేపథ్యంలో ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ జియో , 800లకు పైగా పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ అయిన వెబ్‌సైట్‌ల జాబితాలో పోర్న్‌హబ్ వంటి పాపులర్ పోర్న్ వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి.

.comకు బదులుగా .netను వినియగించండి..
తాజా పరిణమాల నేపథ్యంలో పోర్న్‌హబ్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. తమ వెబ్ సైట్ ను యాక్సిస్ చేసుకోలేకపోతోన్న ఇండియన్ యూజర్లు .comకు బదులుగా .netను ఉపయోగిస్తే సరిపోతుందని పోర్న్‌హబ్ తన ట్వీట్‌లో పేర్కొంది. 30 కోట్లకు పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉన్న భారతదేశంలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి మార్కెట్ చాలా పెద్దదిగా ఉండటంతో పోర్న్‌హబ్ వంటి వెబ్‌సైట్‌లు డిస్కౌంట్ రేట్ల పై ప్రీమియమ్ మెంబర్‌షిప్‌లు ప్రొవైడ్ చేస్తున్నాయి.

పోర్న్ సైట్ల పై బ్యాన్ కొత్తేమి కాదు..
నిజానికి పోర్న్ సైట్లపై ఇప్పుడు కాదు, గతంలోనే కేంద్రం కొరడా ఝులిపించింది. 2015లోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దేశంలోని ఐఎస్‌పీలకు పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని చెప్పగా, ఐఎస్‌పీలన్నీ అప్పట్లో ఆ సైట్లను బ్లాక్ చేశాయి. ఈ విషయంపై అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన సెగలు వినిపించగా, కేంద్రం వెనక్కి తగ్గి ఆ సైట్లపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. అప్పటి నుంచి ఆ సైట్లు యథావిధిగా నడుస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..?
అడల్ట్ కంటెంట్ యాక్సిస్ నిలిపివేయాలంటూ, ఉత్తరాఖండ్ హైకోర్ట్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఆఘమేఘాల మీద స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, 827 పోర్న్ వెబ్‌సైట్‌ల పై కొరడా జులుపించింది. తక్షణమే వీటిని బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

రెడ్డిట్‌లో అభిప్రాయాల వెల్లువ...
గడిచిన వారం రోజులుగా తాము జియో నెట్‌వర్క్‌లో అడల్డ్ వెబ్‌సైట్‌లను యాక్సిస్ చేసుకోలేకపోతున్నట్లు పలువురు యూజర్లు రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. డాట్ ఉత్తర్వుల నేపథ్యంలో జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సైతం అడల్ట్ కంటెంట్‌ను బ్లాక్ చేయవల్సి ఉంది. అయితే కొన్ని నెట్‌వర్క్‌లలో పోర్న్ కంటెంట్ అనేది ఓపెన్ అవుతూనే ఉంది.


Click it and Unblock the Notifications








