Home
News

మూడేళ్లకే జియో సంచలనం,ఎయిర్‌టెల్‌కు భారీ షాక్

By Gizbot Bureau

ప్రముఖ టెలికాం సంస్థలను వెనక్కి నెట్టి అనతికాలంలోనే మార్కెట్‌లో రియలన్స్ జియో దూసుకుపోతుంది. ప్రభుత్వ డేటా ప్రకారం ఇండియా మార్కెట్‌లో అత్యధిక వినియోగదారులను రిలయన్స్ జియో సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో రిలయన్స్ జియో రెండో స్థానంలో ఉండగా, భారతీఎయిర్‌టెల్ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది.

Reliance Jio becomes second-largest telco in terms of subscribers

ఐడియా, వోడాఫోన్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ తొలి స్థానంలో 38.75 కోట్ల మంది వినియోగదారులతో వైర్ లెస్ సెగ్మెంట్ లో తొలి స్థానంలో ఉంది. అయితే, ఇదే సమయంలో వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 39.32 కోట్ల నుంచి 38.75 కోట్లకు తగ్గడం గమనార్హం. ఏప్రిల్ గణాంకాలను విడుదల చేసిన ట్రాయ్, వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 56 లక్షలకు పైగా తగ్గిందని తెలిపింది.2016 సంవత్సరంలో రిలయన్స్ జియోను ప్రారంభించారు. కొత్త ఆఫర్లతో కస్టమర్లను రిలయన్స్ తమ వైపు తిప్పుకుంది.

మొబైల్ చందాదారుల పరంగా

మొబైల్ చందాదారుల పరంగా

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ముఖ్యంగా మొబైల్ చందాదారుల పరంగా ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండవ అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. మరోవైపు వొడాఫోన్‌ ఐడియా టాప్‌ప్లేస్‌ను నిలబెట్టుకుంది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది. వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం

గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం

ఇండియాలో వైర్ లెస్ టెలీ డెన్సిటీ 88.31 నుంచి 88.42కు పెరిగిందని ట్రాయ్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ 56.42 నుంచి 56.94కు పెరిగిందని వెల్లడించింది.ఇండియాలోని గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోందని తెలిపిన ట్రాయ్, నెట్ వర్క్ సైతం వేగంగా పెరుగుతోందని పేర్కొంది. కాగా, ఇండియాలో ప్రస్తుతం వినియోగదారుల సంఖ్య విషయంలో వోడాఫోన్-ఐడియా తొలి స్థానంలో, రిలయన్స్ జియో రెండో స్థానంలో, ఎయిర్ టెల్ మూడో స్థానంలో ఉన్నాయని వెల్లడించింది.

ముకేశ్‌ అంబానీ వార్షికవేతనం

ముకేశ్‌ అంబానీ వార్షికవేతనం

బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వార్షికవేతనాన్ని మరోసారి పరిమితం చేసుకున్నారు. వరుసగా 11 సంవత్సరం కూడా వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. 2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 24 కోట్లను వదులుకుంటున్నారు. కాగా 2019 ఆర్థిక సంవత్సారానికి గాను నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని పూర్తి కాలం డైరెక్టర్ల జీతం భారీగా పుంజుకుంది. ఆర్‌ఐఎల్‌విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది.

పెరిగిన వేతనాలు

పెరిగిన వేతనాలు

అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది. ఇది 2017-18లో రూ .19.99 కోట్లు, 2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే, అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం గత ఏడాదితో పోలిస్తే రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది. నీతా అంబానీతో సహా ఆర్‌ఐఎల్‌కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ .1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .1.3 కోట్లు మాత్రమే.

రూ. 15 కోట్లకు పరిమితం

రూ. 15 కోట్లకు పరిమితం

అయితే 2018 అక్టోబర్ 17న ఆర్‌ఐఎల్ బోర్డులోమాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య రూ. 75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు. కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీకి ఫీజుగా రూ .7 లక్షలు దక్కాయి. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ .6 లక్షలు. అంబానీతో పాటు, ఆర్‌ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉండగా, నీతా అంబానీతో పాటు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో మన్సింగ్ ఎల్ భక్తా, యోగేంద్ర పీ త్రివేది, దీపక్ సీ జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్‌భాయ్‌ రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ , అరుంధతి భట్టాచార్య ఉన్నారు. కాగా కార్పొరేట్ సీఈవోల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Reliance Jio becomes second-largest telco in terms of subscribers, Vodafone-Idea leads: Report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X