Home
News

రూ.50 కంటే తక్కువ ధరలో జియో డేటా రీఛార్జ్‌ ప్లాన్‌లు.. లిస్ట్‌ ఇదిగో..!

జియో ప్రస్తుతం భారత టెలికాం రంగంలో తొలి స్థానంలో ఉంది. ఏకంగా 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియో అనేక ప్రత్యేకమైన రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుత యూజర్ల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. భారత్‌లో మొబైల్‌ యూజర్లు అధిక మొత్తంలో డేటాను ఉపయోగిస్తున్నారు. తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండడంతో డేటాను అధికంగా వినియోగిస్తున్నారు.

జియోలో ప్రస్తుతం రోజువారీ 1.5GB డేటా లేదా అంతకంటే ఎక్కువ డేటా అందిస్తున్న రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే ఏదైనా సందర్భంలో అదనపు డేటా కావాల్సిన యూజర్ల కోసం జియో.. తక్కువ ధరలో అనేక డేటా ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ జాబితాలో రూ.11, రూ.19, రూ.29, రూ.39, రూ.49 వంటి అనేక డేటా ప్యాక్స్‌లు ఉన్నాయి.

Jio Best prepaid Data packs under Rs50  here is the list and benefits

జియో రూ.11 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లో (Jio Rs11 Data Pack) భాగంగా యూజర్లు గరిష్ఠంగా 10GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ గంటపాటు మాత్రమే ఉంటుందని జియో తెలిపింది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలను పొందలేరు.

జియో రూ.19 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs19 Data Pack) భాగంగా జియో యూజర్లు 1GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఒక్కరోజుగా ఉంటుంది. అంటే అర్ధరాత్రికి ముగుస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి కాలింగ్‌, SMS, ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.29 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (Jio Rs29 Data Pack) భాగంగా జియో యూజర్లు 2GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS సహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.39 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు రోజువారీ 3GB 4G డేటాను పొందుతారు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 3 రోజులుగా ఉంటుందని జియో తెలిపింది.

అంటే ఈ ప్లాన్‌లో (Jio Rs39 Data Pack) మొత్తంగా 9GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో డేటా మినహా ఎటువంటి కాలింగ్‌, SMS, ఇతర ప్రయోజనాలను అందించడం లేదని జియో తెలిపింది.

రూ.49 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ‌ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. అంటే గరిష్ఠంగా 25GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ హైస్పీడ్‌ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఒక్క రోజుగా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో (Jio Rs49 Data Pack) అన్‌లిమిటెడ్‌ డేటా మినహా యూజర్లు కాలింగ్‌, SMS సహా ఇతర ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని జియో తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Best prepaid Data packs under Rs50
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X