Home
News

ప్రతిరోజు 2GB డేటాను అందించే జియో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. ఇలాంటి యూజర్లకు అనుకూలం..!

జియో ప్రస్తుతం టెలికాం రంగంలో యూజర్ల పరంగా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా, BSNL వంటి సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం యూజర్లను ఆకట్టుకొనేందుకు జియో అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్‌, డేటా, ఓటీటీ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్‌ ప్లాన్‌ లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

జియో ప్రస్తుతం 1GB, 1.5GB, 2GB, 3GB డేటాతో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌ లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ.700 కంటే తక్కువ ధరలో ప్రతి రోజు 2GB డేటాను అందించే మూడు రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉంది. రూ.198, రూ.349, రూ.445, రూ.629 ప్లాన్‌ లు 2GB డేటాను (Jio 2GB Data Recharge Plans) అందిస్తున్నాయి. ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి.

Jio Best Prepaid Recharge plans

జియో రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్‌ 64kbps గా ఉంటుంది. అయితే 5G నెట్‌వర్క్‌, స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటే అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో (Jio Rs198 Recharge Plan) భాగంగా జియో క్లౌడ్‌, జియో టీవీ యాప్స్‌ ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్‌ 5G డేటా కావాలనుకొనే యూజర్లకు అనుకూలంగా ఉంటుంది.

జియో రూ.349 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం డేటా స్పీడ్‌ 64kbps గా ఉంటుంది.

అయితే ఈ ప్లాన్‌ లో (Jio Rs349 Recharge Plan) భాగంగా 5G నెట్‌వర్క్‌, 5G సపోర్టు డివైజ్‌ లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో క్లౌడ్‌ సర్వీసులను కూడా ఉపయోగించుకోవచ్చు.

జియో రూ.445 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs445 Recharge Plan) భాగంగా ఏకంగా 11 OTT లను వినియోగించుకోవచ్చు. ఈ జాబితాలో sonyLIV, Zee5, Sun NXT, డిస్కవరీ ప్లస్‌, Lionsgate Play, Chaupal, Flat Marathi సహా మరిన్ని ఓటీటీలు ఉన్నాయి. దీంతోపాటు జియో క్లౌడ్‌ సర్వీసులను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

జియో రూ.629 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs629 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు డేటా పరంగా రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 112GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో క్లౌడ్‌ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Best Prepaid Recharge plans with 2GB Daily data under Rs700 here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X