రూ.999 కే JioBharat 4G ఫోన్.. అమెజాన్‌లో సేల్..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Jio Bharat 4G ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్లు వినియోగిస్తున్న వారికి అందుబాటులోకి తీసుకురావడమే జియో ఉద్దేశమని తెలుస్తోంది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు వేగవంతమైన ఇంటర్నెట్‌కు మారుతారని భావిస్తోంది.
జియో భారత్ 4G ఫోన్ 1.77 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 3.5 mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. LED ఫ్లాష్ లైట్‌తో కూడిన 0.3MP కెమెరా ఉంటుంది. మరియు తక్కువ కాంతిలోనూ మంచి నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు. దీంతోపాటు 1000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన యాష్ బ్లాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారతదేశంలోని 23 భాషలను సపోర్టు చేస్తుంది.

జియో భారత్ 4G ఫోన్‌లో మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు స్టోరేజీని పెంచుకొనే వీలుంటుంది. ఈ ఫోన్‌ను కార్బన్ సంస్థ భాగస్వామ్యంతో జియో తయారు చేసింది. అందువల్ల ఈ ఫోన్ డిస్‌ప్లే వద్ద భారత్ పేరు కనిపిస్తుంది. అలాగే ఫోన్ వెనుకవైపు కార్బన్ లోగోను చూడవచ్చు. ఈ ఫోన్ ధర కేవలం రూ.999గా ఉంది. అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ కోసం జియో తక్కువ ధర రీఛార్జ్ ఫ్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.123తో రీఛార్జ్ చేస్తే.. 28 రోజుల కాలపరిమితితో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు 14GB డేటా వస్తుంది. దీని ద్వారా జియో యాప్‌లు సహా వీడియో కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు సంవత్సర కాలపరిమితితో మరో ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. రూ.1234తో రీఛార్జ్ చేయడం ద్వారా దీనిని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా 168GB డేటాను పొందవచ్చు.

ఆగస్టు 28 నుంచి అమెజాన్ ద్వారా జియో భారత్ 4G ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లలోనూ ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ ఇతర రిటైల్ దుకాణాల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో సంస్థ వెల్లడించలేదు.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం సోమవారం (ఆగస్టు 28)న నిర్వహించారు. ఇందులో సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 19న జియో ఎయిర్‌ఫైబర్‌ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో ముందుగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
గత సంవత్సరం రిలయన్స్ నిర్వహించిన సాధారణ సమావేశంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను ప్రకటించారు. ఇది రిలయన్స్ జియో నుంచి ప్లగ్ అండ్ ప్లే 5G బ్రాడ్‌బ్యాండ‌్ రూటర్, జియో ఎయిర్‌ఫైబర్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు కస్టమర్లు ఎలాంటి వైరింగ్, కేబుల్ అవసరం ఉండదు. జియో ఫైబర్ పరికరం సరిపోతుంది. దీంతో వినియోగదారులు తమ సొంత Wi-Fi హాట్‌స్పాట్‌ను ఇంట్లోనే కలిగి ఉంటారు.
ఎయిర్‌టెల్ ఇప్పటికే ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌ను రూ.799 ప్రారంభ ధరతో ప్రారంభించింది. అయితే జియో ధర కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జియో ఎయిర్ ఫైబర్‌ను స్మార్ట్ టీవీ, ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలకు సులభంగా కనెక్ట్ చేయవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభ ధర, ప్లాన్లు, ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








