జియో సంచలనం, రూ.251కే 102 జిబి డేటా
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకువెళుతోంది. మొత్తం టెలికాం సెక్టార్ నే మార్చిన జియో క్రికెట్ అభిమానుల కోసం ఎక్కువ డేటాను అందించేందుకు రెడీ అయింది. ఐపీఎల్ 2019 సీజన్
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకువెళుతోంది. మొత్తం టెలికాం సెక్టార్ నే మార్చిన జియో క్రికెట్ అభిమానుల కోసం ఎక్కువ డేటాను అందించేందుకు రెడీ అయింది. ఐపీఎల్ 2019 సీజన్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో జియో తమ యూజర్లకు రూ.251తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఆవిష్కరించింది.

జియోతో పాటు మిగతా టెలికం సంస్థలన్నీ ప్రత్యేకమైన ఐపీఎల్ రీచార్జ్ ప్లాన్లను ఆవిష్కరించే పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నాయి.. రిలయన్స్ జియో కంపెనీ తాజాగా అందిస్తున్న రూ.251 ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ వివరాలను పరిశీలిస్తే..

రూ.251 ప్లాన్
జియో క్రికెట్ డేటా ప్లాన్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.251 ప్లాన్ కింద జియో యూజర్లు రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 51 రోజులు.

మొత్తంగా 102 జీబీ 4జీ డేటా
యూజర్లకు రిలయన్స్ జియో క్రికెట్ డేటా ప్లాన్ మొత్తంగా 102 జీబీ 4జీ డేటా అందిస్తుంది. జియో క్రికెట్ డేటా ప్లాన్ కింద యూజర్లకు ఎలాంటి వాయిస్ కాల్ ఫెసిలిటీ ఉండదు. అలాగే ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉండవు. కేవలం ఇంటర్నెట్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.

రోజుకు 2 జీబీ డేటా
రిలయన్స్ జియో తాజా రూ.251 ప్లాన్‌తోపాటు వివిధ ప్లాన్ల ద్వారా కూడా రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. 28 రోజుల వాలిడిటీతో రూ.198 ప్లాన్, 70 రోజుల వాలిడిటీతో రూ.398 ప్లాన్, 84 రోజుల వాలిడిటీతో రూ.448 ప్లాన్, 91 రోజలు వాలిడిటీతో రూ.498 ప్లాన్ అందుబాటులో ఉన్నాయి.

వివోతో జత
ఇదిలా ఉంటే జియో చైనా దిగ్గజం వివోతో జతకట్టింది. దీనిలో భాగంగా వివో స్మార్ట్‌ఫోన్స్‌పై ఏకంగా రూ.10,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. అలాగే 3.3 టెరాబైట్ డేటాను ఆఫర్ చేస్తోంది. వివో వి15, వివో వి15 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌కు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

రూ.10,000 వరకు ప్రయోజనాలు
మార్చి 6 నుంచి జూన్ 3 మధ్యకాలంలో ఈ ఫోన్లు కొనుగోలు చేసిన కొత్త జియో యూజర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.10,000 వరకు ప్రయోజనాల్లో రూ.6,000 రీచార్జ్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తుంది. దీన్ని పొందాలంటే స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.299 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








