సత్తా చాటిన Jio, BSNL: ఎప్పుడు, ఎక్కడ ?
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డేటా వార్ లో నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఈ వార్ ముదిరి మరింత పాకానికి వస్తోంది. యూజర్లను కాపాడుకునేందుకు అలాగే కొత్త యూ
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డేటా వార్ లో నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఈ వార్ ముదిరి మరింత పాకానికి వస్తోంది. యూజర్లను కాపాడుకునేందుకు అలాగే కొత్త యూజర్లను దక్కించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నాయి

ఇందులో భాగంగా రిలయన్స్ జియో , ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ మరింతగా ముందుకు దూసుకువెళుతున్నాయని ట్రాయ్ రిపోర్ట్ తెలిపింది. ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం..దేశీ టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది.

ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను
రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను తమ సొంతం చేసుకున్నాయి.

వొడాఫోన్ ఐడియా
అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపెనీల జాబితాలో.. వొడాఫోన్ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది. జియో , బిఎస్ఎన్ఎల్ ని మినహాయిస్తే... మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్‌లెస్ కస్టమర్లను కోల్పోయాయి.

జియో, బిఎస్ఎన్ఎల్
ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను చేర్చుకోవడంతో పాటు అనతికాలంలోనే 30 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది.

అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ
జోరు మీదున్న బిఎస్ఎన్ఎల్ దూకుడు గురించి బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగింది. సంస్థ 3జీ నెట్‌వర్క్ మరింత మెరుగుపడింది' అని వ్యాఖ్యానించారు.

57.87 లక్షల సబ్‌స్క్రైబర్లను
ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ఒక్కటైన వొడాఫోన్ ఐడియా 57.87 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.


Click it and Unblock the Notifications