జియో IPL ఆఫర్, 102 జిబి డేటా,ఫైనల్ మ్యాచ్ వరకు ఉచిత లైవ్‌లు,లగ్జరీ ఇల్లు..

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎర్రటి ఎండల్లో ఐపీఎల్ సీజన్ మొదలవుతుండటంతో కూల్ గా కొత్త క్రికెట్ అభిమానుల కోసం కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని రూ.251కే ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద అనేక రకాలైన ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌ను జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌గా వ్యవహరిస్తుండగా, ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో వీలు కల్పించింది. ఏప్రిల్ 7వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఆ తేదీ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లను జియో కస్టమర్లు ఉచితంగా చూడాలంటే రూ.251 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. అనంతరం మై జియో యాప్‌లో క్రికెట్ లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చు.

BSNL సంచలనం, 40 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరిక !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 251 ప్లాన్ రీఛార్జ్ ద్వారా..

రూ. 251 ప్లాన్ రీఛార్జ్ ద్వారా యూజర్లు 102 జీబీ డేటాను పొందవచ్చు. ఈ జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లు జియో ధన్ ధనా ధన్ లైవ్ కింద క్రికెట్ కామెడీ షోలను కూడా వీక్షింవచ్చు. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి ఈ షోలు ప్రసారమవుతాయి. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ఉంటాయి.

లైవ్‌లో కూడా ..

వీటిని లైవ్‌లో కూడా వీక్షించవచ్చు. ఇక ఈ కామెడీ షోలకు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలకు యాంకర్ సమీర్ కొచ్చర్, కమెడియన్లు శిల్పా షిండే, అలీ సాగర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గనత్ర, శిభానీ దండేకర్, యాంకర్ అర్చన విజయ, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు.

మై జియో యాప్‌లో ..

ఆఫ్ ది ఫీల్డ్‌లో జరిగే అన్ని విషయాలకు సంబంధించి వీరు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇక ఈ కామెడీ షోలను కూడా మై జియో యాప్‌లో వీక్షించవచ్చు. కేవలం జియో కస్టమర్లకు మాత్రమే కాకుండా నాన్ జియో కస్టమర్లకు కూడా ఈ కామెడీ షోలు అందుబాటులో ఉంటాయి.

ముంబైలో ఓ లగ్జరీ ఇంటిని..

జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌లో భాగంగా జీతో ధన్ ధనా ధన్ అనే మరో ఆఫర్‌ను కూడా జియో అందిస్తున్నది. ఇందులో భాగంగా ప్రేక్షకులు జియో క్రికెట్ ప్లే అనే ఓ మొబైల్ వీడియో గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇందులో విన్ అయ్యే వారికి బంపర్ ఆఫర్ కింద ముంబైలో ఓ లగ్జరీ ఇంటిని అందిస్తామని జియో తెలిపింది.

మరో 25 మందికి కార్లను..

ఇక మరో 25 మందికి కార్లను బహుమతులుగా ఇస్తారు. వీటితోపాటు కోట్ల రూపాయల విలువ చేసే నగదు బహుమతులను కూడా ఈ గేమ్ విన్నర్స్‌కు అందిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
JIO BUMPER OFFER for IPL Season, Offers 102 GB at Rs 251 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot