మళ్లీ అదిరే ఆఫర్లతో దూసుకొచ్చిన జియో, ఈ సారి గడువు పరిమితి !

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో వరుసగా నాలుగో సారి పంజా విసిరింది. దిగ్గజాలకు ధీటుగా మళ్లీ భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో దూసుకొచ్చింది. అయితే తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదుని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా తన ప్రైమ్‌ కస్టమర్లకు మరో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను జియో ప్రకటించింది.రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు ఈ కొత్త జియో ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

జియోతో దోస్తీకట్టిన ఇన్ఫోకస్ A2...30జిబి డేటా ఫ్రీ!జియోతో దోస్తీకట్టిన ఇన్ఫోకస్ A2...30జిబి డేటా ఫ్రీ!

కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను ..

కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను ..

ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. రీఛార్జ్‌ ఓచర్లు, వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ ప్రయోజనాలు కస్టమర్లకు అందనున్నాయి.

99 రూపాయల ఎక్కువ ప్రయోజనాలను..

99 రూపాయల ఎక్కువ ప్రయోజనాలను..

ముందటి జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 99 రూపాయల ఎక్కువ ప్రయోజనాలను జియో అందిస్తోంది. గరిష్ట వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ను రూ.300 నుంచి రూ.399 పెంచింది. ఈ ఆఫర్‌ 2018 ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో ఉంటుంది.

రూ.50తో ఎనిమిది ఓచర్లను ..

రూ.50తో ఎనిమిది ఓచర్లను ..

జియో ముందు ఆఫర్‌ చేసిన క్యాష్‌బ్యాక్స్‌ మాదిరిగా కస్టమర్లకు రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.50తో ఎనిమిది ఓచర్లను అందించనుంది. అంటే మొత్తంగా 400 రూపాయల ప్రయోజనాలు పొందనున్నారు.

కొనుగోలు చేసిన ప్రతిసారి..
 

కొనుగోలు చేసిన ప్రతిసారి..

ఈ ఓచర్లతో రీఛార్జ్‌ ప్యాక్‌ కొనుగోలు చేసిన ప్రతిసారి రూ.50 తక్కువ చేసుకోవచ్చు. మిగతా రూ.399 మొత్తాన్ని కస్టమర్లకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ రూపంలో జియో ఆఫర్‌ చేయనుంది. మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌పే, ఫోన్‌పే, ఫ్రీఛార్జ్‌, యాక్సిస్‌ పే నుంచి ఈ క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లు పొందనున్నారు.

రూ.2,500 వరకు హోటల్‌ ఓచర్‌

రూ.2,500 వరకు హోటల్‌ ఓచర్‌

ఎవరైతే మొబిక్విక్‌ వాలెట్‌ వాడి రూ.398 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకుంటారో, వారికి రూ.2,500 వరకు హోటల్‌ ఓచర్‌ లభించనుంది. అదేవిధంగా పేటీఎం యూజర్లు తొలిసారి మూవీ టిక్కెట్‌ బుకింగ్‌పై 50 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు.

 ఇది నాలుగవది..

ఇది నాలుగవది..

ఓచర్లు, క్యాష్‌బ్యాక్‌లను యూజర్లు వెంటనే రిడీమ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ నుంచి జియో అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లలో ఇది నాలుగవది. అయితే ముందు ముందు ఇంకా ఈ ఆఫర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

జియో కాయిన్స్‌ యాప్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ, ఎప్పుడు వస్తుంది..?

జియో కాయిన్స్‌ యాప్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ, ఎప్పుడు వస్తుంది..?

టెలికాం సంస్థ రిలయన్స్ జియో నూతన క్రిప్టోకరెన్సీని జియో కాయిన్ పేరిట తయారు చేస్తున్నదని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వం వహించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని జియో తెలియజేసింది. కంపెనీ లేదా తమకు సంబంధించిన అసోసియేట్స్‌ ఎలాంటి యాప్స్‌ను ఆఫర్‌ చేయడం లేదని ప్రజలకు, మీడియాకు తాము తెలియజేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. జియోకాయిన్‌ పేరుతో వస్తున్న అన్ని యాప్స్‌కు కూడా నకిలీవే అని పేర్కొంది.

గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా

గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా

గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా .. జియో కాయిన్ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా యాప్స్ ఉన్నాయని, అలాగే పలు వెబ్‌సైట్లు కూడా పుట్టుకొచ్చాయని వాటితో జియోకు ఎలాంటి సంబంధం లేదని జియో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్

22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్

జియో పేరుతో యోగ్యత లేని కొంతమంది వ్యక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా మొత్తం గూగుల్ ప్లో స్టోర్ లో 22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్ ని గుర్తించారు.

జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని.

జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని.

జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని.. ఎవరూ కూడా జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని, అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోవద్దని జియో హెచ్చరించింది. అయితే భవిష్యత్తులో జియో కాయిన్‌ను విడుదల చేస్తారా లేదా అన్న విషయంపై మాత్రం జియో స్పష్టతనివ్వలేదు.

బిట్‌కాయిన్‌..

బిట్‌కాయిన్‌..

గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో డిజిటల్‌ కరెన్సీకి విపరీతంగా డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో బిట్‌కాయిన్‌ ఎక్కువగా పాపులర్‌ అయింది.

పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌..

పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌..

దీనిలో ఒక్కో జియో కాయిన్‌ను వంద రూపాయలకు లాంచ్‌ చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌తో రిజిస్టర్‌ అవ్వాలంటూ ఈ నకిలీ వెబ్‌సైట్‌ యూజర్లను తప్పుదోవ పట్టించింది.దీనిలో ఏదన్నా సమాచారం రాయడానికి కనీసం వెబ్‌సైటే ఓపెన్‌ అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కూడా.

 

 

Best Mobiles in India

English summary
Jio Cashback Offer: Benefits of Up to Rs. 799 on Recharge of Rs. 398 and Above More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X