Home
News

డిసెంబర్ 15 వరకు జియో ఆఫర్ పొడిగింపు !

దేశీయ టెల్కో దిగ్గజాలు వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్లకు కౌంటర్ గా జియో తీసుకువచ్చిన ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల పొడిగింపునకు రెడీ అయింది.

By Hazarath

దేశీయ టెల్కో దిగ్గజాలు వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్లకు కౌంటర్ గా జియో తీసుకువచ్చిన ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల పొడిగింపునకు రెడీ అయింది. ఈ నెల 25తో ముగిసిన ఈ ఆఫర్‌ గడువును మరికొన్ని రోజులు జియో పొడిగించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. డిసెంబర్‌ 15 వరకు ఈ ఆఫర్‌ను జియో తన వినియోగదారులకు అందించనున్నట్టు రిపోర్టులు తెలిపాయి.

ప్రైమ్‌ యూజర్లు..

ప్రైమ్‌ యూజర్లు..

ఈ పొడిగించిన ఆఫర్ కింద ప్రైమ్‌ యూజర్లు జియో ఓచర్లు, వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌, షాపింగ్‌ డిస్కౌంట్లను వచ్చే నెల మధ్య వరకు జియో ఆఫర్‌ చేయనుంది.

ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద..

ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద..

జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది.

రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో..

రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో..

ఈ మొత్తాన్ని రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో జియో ఆఫర్‌ చేస్తోంది. తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు.

డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే..

డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే..

అయితే డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్‌లు అందుతున్నాయి. ఒరిజినల్‌ ఆఫర్‌ మాదిరిగా కాకుండా.. యాక్సిస్‌ బ్యాంకు, ఫ్రీఛార్జ్‌ యూజర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.

కొత్త యూజర్‌గా..

కొత్త యూజర్‌గా..

కొత్త యూజర్‌గా జియో నెట్‌వర్క్‌లో చేరి, అమెజాన్‌ పేను వాడుతూ రూ.459 రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేస్తే, రూ.400 విలువైన ఓచర్లు, పే బ్యాలెన్స్‌గా రూ.50 క్యాష్‌బ్యాక్‌, అన్నీ కలిపి మొత్తంగా రూ.450ను కస్టమర్లకు కంపెనీ ఆఫర్‌చేస్తుంది.

మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను..

మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను..

వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌, జియో ఓచర్లను వెంటనే రిడీమ్‌ చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్‌లతో పాటు ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌, ట్రావెల్‌ కొనుగోళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో ఆఫర్‌ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Jio Cashback Offer’s Last Date Extended to December 15 Read more News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X