ముకేష్ అంబానీ సరికొత్త స్కెచ్, మరో విప్లవం దిశగా...

దేశీయ టెలికాం రంగంలో జియోతో సునామి లాంటి విప్లవాన్ని తీసుకువచ్చిన వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీ రంగంలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్‌ తరహ

|

దేశీయ టెలికాం రంగంలో జియోతో సునామి లాంటి విప్లవాన్ని తీసుకువచ్చిన వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీ రంగంలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్‌ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం.

ముకేష్ అంబానీ సరికొత్త స్కెచ్, మరో విప్లవం దిశగా...

ఈ మెగా సిటీ ప్రాజెక్ట్‌లో ప్రతీ విభాగం ఒక భారీ ప్రాజెక్టుగా ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం, పోర్టులకు కూడా దీన్ని అనుసంధానించనున్నట్లు వివరించాయి. దీని పూర్తి వివరాల్లోకెళితే..

75 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు

75 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు

ఈ మెగాసిటీ పూర్తయితే ఏకంగా అయిదు లక్షల మందికి నివాసం కాగలదని, వేల కొద్దీ వ్యాపార సంస్థలకు కేంద్రం కాగలదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే పదేళ్లలో దీనిపై దాదాపు 75 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నారు.

అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు

అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు

టెలికం రంగంలో జియోతో అత్యంత తక్కువ ధరతో చార్జీల విప్లవం తీసుకొచ్చినట్లే ఈ ప్రాజెక్టులో అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు అందించడంపై అంబానీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా దేశీయంగా పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపాన్ని సమూలంగా మార్చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

నిర్వహణపరమైన బాధ్యతలు

నిర్వహణపరమైన బాధ్యతలు

ముంబై దగ్గర ఈ మెగా సిటీని అభివృద్ధి చేయడంతో పాటు దాని పరిపాలనకు సంబంధించి నిర్వహణపరమైన బాధ్యతలు కూడా రిలయన్సే చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ తీసుకున్న స్పెషల్‌ ప్లానింగ్‌ అథారిటీ లైసెన్సు ఇందుకు ఉపయోగపడనుందని తెలుస్తోంది.

చాలామంది భారీగా వలస

చాలామంది భారీగా వలస

ప్రాజెక్టులో నివాసితులకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంలో జాప్యంతో పాటు ఇతరత్రా వ్యయాలు కూడా దీనివల్ల తగ్గగలవని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ముంబై ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ అవకాశాలరీత్యా చాలామంది భారీగా వలస వస్తుంటారు.

 

 

ధీరూభాయ్‌ అంబానీ కల

ధీరూభాయ్‌ అంబానీ కల

ఈ మెగా సిటీ పూర్తయితే రివర్స్‌లో ముంబై నుంచి కొత్త నగరానికి వలసలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే రిలయన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ 1980లలోనే ఇలాంటి ప్రపంచ స్థాయి నగరాన్ని నేవీ ముంబైలో నిర్మించాలని అనుకున్నారు. తద్వారా దక్షిణ ముంబై, నవీ ముంబైలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించాలని భావించారు. అయితే అనుకోని కారణాల వల్ల అది పట్టాలు ఎక్కలేదు.

 4,000 ఎకరాలు లీజుకు

4,000 ఎకరాలు లీజుకు

ప్రపంచపు స్థాయిలో ఎకనమిక్‌ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా నేవీ ముంబై సెజ్‌ (ఎన్‌ఎంసెజ్‌) నుంచి దాదాపు 4,000 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు రిలయన్స్‌ ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 2,180 కోట్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఎన్‌ఎంసెజ్‌లో ముకేశ్‌ అంబానీకి వాటాలు ఉండటం కూడా మెగాసిటీ రూపకల్పనకు ఊతమిస్తోంది.

Best Mobiles in India

English summary
reliance industries chairman mukesh ambani will enter real estate sector to built mega city project near mumbai

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X