Home
News

Jio Choice పుట్టిన తేదీ లేదా లక్కీ నంబర్‌తో ఫోన్‌ నంబర్‌ కావాలా.. ?

గతంలో ఫోన్ నంబర్‌ ఎంచుకొనేందుకు చాలా పరిమితులు ఉండేవి. అంటే అందుబాటులో ఉన్న నంబర్లలోనే ఏదో ఒక నంబర్‌ను మాత్రమే ఎంచుకొనే వెసులుబాటు ఉండేది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఐడియా, వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ వంటి కొన్ని సంస్థలు నచ్చిన నంబర్లను ఎంచుకొనే అవకాశం అప్పుడప్పుడూ కల్పించేవి. అయితే అందుబాటులో ఉన్న నంబర్లనే కొనుగోలు చేయాల్సి వచ్చేది. జియో తీసుకొచ్చిన కొత్త స్కీమ్‌తో నచ్చిన నంబర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

టెలికాం రంగంలోకి జియో ప్రవేశంతోనే ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు టెలికాం రంగంలో అన్‌లిమిటెడ్ అనే మాట చాలా తక్కువగా వినిపించేంది. అదే జియో రంగప్రవేశంతో టెలికాం రంగంలో చాలా మార్పులు జరిగాయి. 4G ఇంటర్‌నెట్‌ సహా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇంటర్నెట్‌ వినియోగించుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

Jio Choice

ప్రస్తుతం 5Gను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని కీలక నగరాలు, పట్టణాలకు 5G సౌకర్యం అందుబాటులో ఉంది. తాజాగా Jio Choice పేరిట ఓ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా మనకు నచ్చిన నంబర్లను ఫోన్‌ నంబర్‌గా ఎంచుకోవచ్చు. అంటే కొత్త జియో ఫోన్‌ నంబర్‌లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు మీది లేదా మీకు నచ్చిన వ్యక్తి పుట్టినరోజు 1-9-1999 (సెప్టెంబర్‌ 1, 1999) అనుకుందాం. ఈ అంకెలతో కొత్త జియో నంబర్‌ తీసుకోవాలి అంటే జియో ఛాయిస్‌ స్కీమ్‌ కింద మీ కొత్త ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెలను 191999గా ఎంచుకోవచ్చు. పుట్టినరోజునే కాకుండా ఇతర అదృష్ట సంఖ్యలు లేదా కారు, బైక్‌ నంబర్లను ఈ కొత్త ఫోన్‌ నంబర్‌ చివరి 4 నుంచి 6 అంకెలుగా ఎంచుకోవచ్చు.

Jio Choice

జియో ఛాయిస్ స్కీమ్‌ కింద ఈ ఫోన్‌ నంబర్‌ను ఎలా పొందాలి: ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్‌ Jio.comను సందర్శించాలి. అనంతరం సెల్ఫ్‌ కేర్‌ విభాగంలోకి వెళ్లండి. అనంతరం Jio Choice వద్దకు వెళ్లండి. అక్కడ మీకు కావాల్సిన 4 నుంచి 6 అంకెలను నమోదు చేయండి. మరియు అక్కడే సిమ్‌ ప్రీపెయిడ్‌ లేదా పోస్ట్‌ పెయిడ్‌ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

అనంతరం చెల్లింపుల విభాగానికి వెళ్లి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం 24 గంటల్లో మీ కొత్త జియో ఫోన్‌ నంబర్‌ యాక్టివేట్‌ చేయబడుతుంది. అలాగే మన ఫోన్‌లో ఉన్న జియో యాప్‌ నుంచి కూడా జియా ఛాయిస్‌ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. జియో ఛాయిస్‌ విభాగంలోని వెళ్లి నచ్చిన నంబర్‌ను ఎంటర్‌ చేసి, చెల్లింపులు చేయాలి. అనంతరం 24 గంటల్లో నంబర్‌ యాక్టివేట్‌ అవుతుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio choice scheme introduced to choose phone number of your choice
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X