కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
జియో సినిమా యాప్ ప్రస్తుతం ఐపీఎల్‌ను ఉచితంగానే ప్రసారం చేస్తోంది. దీంతోపాటు ఇప్పటికే రెండు ప్లాన్‌లను కలిగి ఉన్నా.. యాడ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే తాజాగా జియో సినిమా యాప్ కోసం రెండు కొత్త సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా యాడ్ ఫ్రీ కంటెంట్ సహా 4k నాణ్యతతో వీడియోలను వీక్షించవచ్చు. మరియు ఆఫ్ లైన్‌లోనూ కంటెంట్‌ను చూడవచ్చు.
రూ.29 నెలవారీ ప్లాన్ : జియో సినిమా (Jio Cinema ad free monthly Plans 2024) కొత్త ప్లాన్ నెలకు రూ.29 కే ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా యాడ్స్ లేకుండానే కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. మరియు సిరీస్‌లు, సినిమాలు, చిన్నారులకు సంబంధించిన షోలు మరియు ఇతర టీవీ షోలను వీక్షించవచ్చు. ఇతర డివైజ్‌లతోపాటు స్మార్ట్ టీవీలోనూ యాక్సెస్ పొందవచ్చు.

ఒకేసారి 4 డివైజ్‌లో కంటెంట్ వినియోగించుకోవచ్చు : దీంతోపాటు నెలకు రూ.89 తో మరో ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఫ్యామిలీ ప్లాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 4 పరికరాల్లో ఒకేసారి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియం వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా ఆటోమేటిక్‌గా ఈ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు.
ప్రస్తుతం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను (IPL 2024) ఉచితంగా ప్రసారం చేస్తున్నా.. ఈ రెండు కొత్త ప్లాన్లతో యాడ్స్ లేకుండానే వీడియోలను వీక్షించవచ్చు. ఈ ప్లాట్ ఫాం ద్వారా చిన్నారులు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ జియో సినిమా చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా Parental కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఇప్పటికే ప్రస్తుతం జియో సినిమా యాప్ రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.99 నెలవారీ ప్లాన్, రూ.999 సంవత్సర ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు ప్లాన్‌లోనూ పూర్తిగా యాడ్ ఫ్రీ ఆప్షన్ లేదు. ప్రీమియం యూజర్ల కూడా కొన్ని యాడ్స్ ను చూడాల్సి ఉంటుంది.
12 భాషల్లో జియో సినిమా యాప్ ప్రసారాలు :
ప్రస్తుతం జియో సినిమా యాప్ ఐపీఎల్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, కన్నడ సహా 12 భాషల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ HBO మరియు ఇతర ఛానల్ నుంచి ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications