జియో మళ్లీ అదే స్టేటజీ... ఫ్రీ కాస్త ప్రీమియం.. !
IPL 2023 ప్రసార హక్కులను ఈసారి జియో సినిమా యాప్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యాప్ కోట్లాది మందికి చేరువైంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తున్న జియో సినిమా యాప్.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్‌లు సహా మిగిలిన కంటెంట్‌ను వినియోగించుకొనేందుకు ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదు. కానీ త్వరలో యాప్‌లోని కంటెంట్‌కు ఛార్జీలు విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికిప్పుడు ఛార్జీలు విధించకపోయినా.. ఈ ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఛార్టీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. జియో నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలోనూ ఇదే స్టేటజీని అమలుచేశారు, కొన్ని నెలలపాటు ఉచితంగానే కాల్స్, డేటా, SMS వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అనంతరం అన్ని సేవలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు జియో సినిమా యాప్ విషయంలోనూ అదే స్టేటజీని అమలుచేస్తున్నారు.

ఈ ఛార్జీలు విధించడంపై సోషల్ మీడియా వేదికైన Redditలో ఓ యాజర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జియో సినిమా యాప్ రీబ్రాండింగ్ స్టేటజీని అమలుచేస్తుందని, త్వరలో ఈ యాప్ జియోవూట్ (Jiovoot) గా మారనుందని కామెంట్స్ చేశాడు.
జియో సినిమా యాప్ వినియోగించేందుకు రోజువారీ ప్లాన్, మూడు నెలల ప్లాన్, ఏడాది ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే మొదట్లో ఈ ప్లాన్లపై భారీగా డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం, జియో సినిమా యాప్ రోజువారీ ప్లాన్ కోసం 29 రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. తొలుత కేవలం రూ.2 చెల్లిస్తే సరిపోతుంది. మరియు మూడు నెలల ప్లాన్ కోసం రూ. 299 చెల్లించాల్సి ఉంది. కానీ మొదట్లో కేవలం రూ. 99 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఏడాది ప్లాన్ల కోసం రూ. 1199 చెల్లించాల్సి ఉంది. అయితే తొలుత కేవలం 599 రూపాయలకే ఏడాది పాటు వినియోగించుకొనే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
జియో సినిమా యాప్ మూడు నెలల ప్లాన్ తీసుకున్న వినియోగదారులు ఏకకాలంలో రెండు డివైజ్‌లలో కంటెంట్‌ను చూడవచ్చని Reddit వేదికగా సదరు యూజర్ వెల్లడించాడు. అదే విధంగా ఏడాది ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులు కూడా ఒకేసారి నాలుగు డివైజ్‌లో కంటెంట్ వీక్షించవచ్చని తెలిపాడు. ఈ మూడు ప్లాన్లలో కూడా జియో సినిమా యాప్ 4k నాణ్యతతో వీడియో కంటెంట్ అందించనుంది.
న్యూస్ ఏజెన్సీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం జియో సినిమా వినూత్నమైన కంటెంట్‌ను అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సుమారు 100 సినిమాలు మరియు టెలివిజన్ సిరీస్‌లను అందుబాటులో ఉంచనుంది. దీంతో పాటు కేవలం జియో సినిమా కోసం ఎక్లూజివ్ కంటెంట్‌ను వినియోగదారులను అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కంటెంట్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠి సహా ఇతర భాషల్లో అందుబాటులో ఉండనుంది.
అయితే జియో వినియోగదారులు సహా ఇతరులకు కూడా ఇవే ప్లాన్స్ అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయంపై ఇంకా స్పషత లేదు. ఈ ప్లాన్లపై కూడా జియో సినిమా యాప్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరియు ఎప్పటి నుంచి ప్రీమియం కంటెంట్ అందుబాటులో ఉంటుందో కూడా అధికారికంగా స్పష్టం చేయలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ముగిసే లోగే ప్రీమియం కంటెంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








