Home
News

జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??

ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్‌ చేస్తున్న జియో సినిమా యాప్‌ (Jio Cinema App) నుంచి కీలక ప్రకటన వెలువడింది. కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ను లాంచ్‌ చేయనున్నట్లు సంస్థ తన X ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌ను ఉచితంగానే ప్రసారం చేసిన జియో సినిమా యాప్‌ ఛార్జీలు వసూలు చేయనుందా..?

ఏప్రిల్‌ 25న ఈ కొత్త ప్లాన్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్లాన్ ద్వారా ఎటువంటి యాడ్స్‌ లేకుండానే ఐపీఎల్‌ ప్రసారాలను (IPL 2024) వీక్షించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్‌ గురించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం యాడ్స్‌తోపాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు వీలుంది.

Jiocinema plans to launch ad free subscription plan

4K నాణ్యతతో వీడియోలు :
ఈ కొత్త ప్లాన్ ద్వారా యాడ్ ఫ్రీ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జియో ప్లాన్‌పై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ద్వారా జియో సినిమా యాప్‌ ద్వారా 4K నాణ్యత కలిగి వీడియోలు, ప్రసారాలను వీక్షించవచ్చు. మరియు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు ప్లాన్‌లు :
ప్రస్తుతం జియోసినిమా యాప్‌ రెండు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.99 నెలవారీ ప్లాన్, రూ.999 సంవత్సర ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు ప్లాన్‌ లోనూ పూర్తిగా యాడ్‌ ఫ్రీ ఆప్షన్‌ లేదు. ప్రీమియం యూజర్ల కూడా కొన్ని యాడ్స్ ను చూడాల్సి ఉంటుంది.

యాడ్స్‌ లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లు :
అయితే కొన్ని ప్లాన్‌ ధర, వ్యాలిడిటీ, ఎన్ని డివైజ్‌లలో వినియోగించుకొనేందుకు అనుమతి ఉంటుంది వంటి వివరాలు వెల్లడి కాలేదు. ఏప్రిల్ 25న ఈ వివరాలతో కూడి ప్లాన్‌ను జియో విడుదల చేయనుంది. ఫలితంగా ఎటువంటి యాడ్స్‌ లేకుండానే ఐపీఎల్‌ ను వీక్షించవచ్చు.

ఆ రెండు OTTలకు పోటిగా :
దీంతోపాటు నెట్‌ ఫ్లిక్స్‌ మరియు డిస్ని + హాట్‌స్టార్‌ కు పోటీనిచ్చే విధంగా జియో సినిమా యాప్ పోకిమన్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా చిన్నారులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రసారం కానున్నాయి.

12 భాషల్లో జియోసినిమా యాప్‌ ప్రసారాలు :
ప్రస్తుతం జియో సినిమా యాప్‌ ఐపీఎల్‌ ఇంగ్లీష్‌, హిందీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, కన్నడ సహా 12 భాషల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ HBO మరియు ఇతర ఛానల్‌ నుంచి ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio cinema plans to launch ad free subscription plan on april 25
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X