Home
News

హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం!.. ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఎలాంటి మార్పులు రానున్నాయి?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమా యాప్‌ యూజర్లకు ఆశ్చర్యకరమైన వార్త. మరో ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ లో జియో సినిమా యాప్‌ను విలీనం చేయనున్నారని (Jio Cinema Hotstar merger) తెలుస్తోంది. అనంతరం ఒకే యాప్‌ అందుబాటులో ఉంటుంది. విలీనం అనంతరం పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. తొలుత డిస్నీ+ హాట్‌స్టార్‌ నే జియో సినిమాలో విలీనం చేస్తారని భావించిన.. కొన్ని కారణాలతో జియో సినిమా యాప్‌నే విలీనం కానుంది. ప్రస్తుతం IPL మ్యాచ్‌లు సహా ఇతర కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా యాప్‌ లో త్వరలో ఎలాంటి మార్పులు రానున్నాయో తెలియాల్సి ఉంది.

100, 500 మిలియన్‌ల డౌన్‌లోడ్స్‌ :
అయితే జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌ విలీనంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ తన నియంత్రణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌ లో జియో సినిమా యాప్‌నకు 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌, డిస్నీ + హాట్‌స్టార్‌ యాప్‌నకు 500 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి.

Jio cinema to merge in disney  hotstar

క్రికెట్‌ మ్యాచ్‌ల పరిస్థితి ఏంటీ :
ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ మరియు డిస్నీల మధ్య $8.5 బిలియన్‌ల విలీనాన్ని ప్రకటించారు.. ఈ ఒప్పందంతో పెద్ద నెట్‌వర్క్‌ గా నిలుస్తుంది. ఈ నిర్ణయంతో దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లు, ICC మ్యాచ్‌లు, IPL మ్యాచ్‌లు అన్ని ఒకే ప్లాట్‌ఫాం కిందకు రానున్నాయి. అయితే జియోసినిమా యాప్‌ తరహాలో ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉందా లేదా అనే అంశంపై ప్రస్తుతం ఎటువంటి స్పష్టత లేదు.

ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ?
ప్రస్తుతం జియో సినిమా అత్యంత తక్కువ ధరలో సేవలు అందిస్తోంది. భవిష్యత్‌లో ధరల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫాంలు అధిక ధరలను వసూలు చేస్తూన్నాయి. దీంతోపాటు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను కట్టడి చేసే అంశంలో ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ అంశాలపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఒప్పందం ఎప్పటికి పూర్తికావాలి :
డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రస్తుతం స్ట్రీమింగ్ మరియు నాణ్యత సహా యాడ్స్‌ సహా ఇతర అంశాల పరంగా ఉత్తమ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఒకటిగా ఉంది. రిలయన్స్‌, డిస్నీల ఒప్పందానికి గతంలోనే అనుమతి లభించింది. జనవరి 2025 నాటికి ఈ రెండు ప్లాట్‌ఫాంల మధ్య ఒప్పందం పూర్తికావాల్సి ఉంది. అయితే పేరు, లోగో, సర్వీసుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో త్వరలో తెలియనుంది.

ప్రస్తుతం స్టార్‌ ఇండియా సంస్థ డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీతోపాటు వివిధ టీవీ ఛానళ్లను కలిగి ఉంది. అదే సమయంలో రిలయన్స్‌ కూడా జియో సినిమాతోటు Viacom18 ఛానళ్ల ను కలిగి ఉంది. ఈ సంస్థల విలీనానికి ఇప్పటి నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ అనంతరం ఏర్పడే సంస్థకు నీతా అంబానీ ఛైరపర్సన్‌ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio cinema to merge in disney+ hotstar what will happen soon full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X