వాయిస్ కాల్స్ చేసుకుంటే డేటా కట్ అవ్వదు.. క్లారిటీ ఇచ్చిన జియో

భారత టెలికాం రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ కొత్త నెట్ వర్క్ అయిన Reliance Jioను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో లాంచ్ చేసిన టారిఫ్ ప్లాన్‌లకు సంబంధించి ఒక్కొక్కటిగా క్లారిఫికేషన్ వస్తున్నప్పటికి జనంలో పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

Read More : మోటో జీ4 ప్లే వచ్చేసింది, రూ.8,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ముఖ్యంగా రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ఉచిత కాల్స్ పై విశ్లేషకులు సైతం పలు సందేహాలను వ్యక్తపరిచారు.

#2

ఇందుకు కారణం రిలయన్స్ జియో కేవలం 4జీ ఆధారంగా పనిచేసే నెట్‌వర్క్ అని, ఈ నెట్‌వర్క్ ద్వారా చేసే అన్ని వాయిస్ కాల్స్ VoLTEను ఉపయోగించుకుంటాయని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆవిష్కరణ సందర్భంగా తెలపటమే.

#3

జియో నెట్ వర్క్ పై పని చేసే ఫోన్‌లలో మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే కాల్స్ వెళ్లవని, మొబైల్ డేటా ఆన్‌లో ఉంటేనే కాల్స్ చేసుకోగలుగుతన్నామని పలువురు చెబుతుండటంతో జియో యూజర్లలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

#4

ఈ అంశం పై స్పష్టతనిచ్చేందుకు వెంటనే స్పందించిన రిలయన్స్ జియో ప్రతినిధులు ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు.

#5

జియో నెట్ వర్క్ పరిధిలో వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితమని డేటాలో ఎటువంటి కౌంట్ ఉండదని వారు స్ఫష్టం చేసారు. అయితే జియో నెట్‌వర్క్ ఆఫర్ చేసే వీడియో కాలింగ్‌కు మాత్రం డేటాలో కౌంట్ అవుతుందని వీరు తెలిపారు.

#6

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తెలిపారు.

#7

ఎంబీకి 5 పైసుల చప్పున, 1జీబికి రూ.50 మాత్రమే ఛార్జ్ ఉంటుందని ఆయన తెలిపారు. నెలకు 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుందని ఆయన తెలిపారు.

#8

'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అంటే డిసెంబర్ 31 వరకు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. 1జీబి డేటా ఖరీదు రూ.50 మాత్రమే. 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుంది. పండుగల.. ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు ఉండవు.

#9

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు.

#10

డిసెంబర్ 31 2017 వరకు రిలయన్స్ జియో యాప్ సూట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. ఈ సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Confirms VoLTE Voice Calls Wont Count Against Your Data Usage but Video Calls Will. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot