Home
News

జియో 8జిబి డేటా ఉచితం,ఎటువంటి పరిమితులు లేవు !

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లకు మరో బంపరాఫర్ ని ప్రకటించింది. దిగ్గజాలను సవాల్ చేస్తే తమ యూజర్లకందరికీ అదనంగా డేటాను అందిస్తోంది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లకు మరో బంపరాఫర్ ని ప్రకటించింది. దిగ్గజాలను సవాల్ చేస్తే తమ యూజర్లకందరికీ అదనంగా డేటాను అందిస్తోంది. అది ఉచితంగా ఎటువంటి పరిమితులు లేకుండా ఈ డేటాను అందిస్తోంది. ఐపీఎల్ అభిమానులకోసం జియో ఈ ఆఫర్ ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న ప్రతి వినియోగదారుడికి 8 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలాంటి లింక్‌ను విజిట్ చేయాల్సిన పనిలేదు. ఏ ప్యాక్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. జియో 8జీబీ డేటాను ఆటోమేటిక్‌గా కస్టమర్ల అకౌంట్లకు యాడ్ చేసింది. మరి ఎలా పొందాలో చూద్దామా..

మైజియో యాప్‌లోకి..

మైజియో యాప్‌లోకి..

ఈ ఉచిత డేటా కావాలంటే ఎవరైనా మైజియో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు యాడ్ అయిన 8జిబి జియో డేటా కనిపిస్తుంది. అయితే ఈ ఈ డేటా మీకు క్రికెట్ ప్యాక్ కింద యాడ్ అయి ఉంటుంది. ఓ సారి వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

జియో టీవీ యాప్ ద్వారా..

జియో టీవీ యాప్ ద్వారా..

కాగా జియో టీవీ యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను వీక్షించే వెసులుబాటును జియో కల్పించిన విషయం విదితమే. దీంతోపాటు అనేక చానల్స్‌ను కూడా ఆ యాప్‌లో చూసేందుకు వీలుంది. ఈ క్రమంలోనే నాణ్యమైన ప్రసారాలను, సేవలను అందిస్తున్నందున జియో టీవీ యాప్‌కు బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్ అవార్డు వచ్చింది.

జీఎస్‌ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో..

జీఎస్‌ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో..

జీఎస్‌ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో భాగంగా జియో ఈ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో జియో అందుకు బహుమతిగా 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా యాడ్ చేసినట్లు వెల్లడించింది.

2జీబీ చొప్పున 4 రోజుల్లో..

2జీబీ చొప్పున 4 రోజుల్లో..

అయితే ఈ డేటాను రోజుకు 2జీబీ చొప్పున 4 రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుంది.4 రోజుల తర్వాత ఈ డేటా ఆటోమేటిగ్గా మాయమైపోతుంది.

ఈ ఏడాది మార్చి వరకు..

ఈ ఏడాది మార్చి వరకు..

కాగా ఈ ఏడాది మార్చి వరకు జియో కస్టమర్ల సంఖ్య ఏకంగా 18.66 కోట్లకు చేరుకుంది. ఇక 2018 జనవరి నుంచి మార్చి నెలల మధ్యలోనే ఏకంగా 2.65 కోట్ల మంది కొత్త కస్టమర్లు జియోలో చేరినట్టు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య..

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య..

ఇక ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య మొత్తం జియో కస్టమర్లు వాడుకున్న డేటా 506 కోట్ల జీబీ అని జియో తెలిపింది. అంటే సగటున ఒక్కో వినియోగదారుడు నెలకు 9.7 జీబీ డేటాను వాడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ మూడు నెలల కాలంలో

ఈ మూడు నెలల కాలంలో

అలాగే ఈ మూడు నెలల కాలంలో జియో కస్టమర్లు 37,218 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్ చేశారని జియో తెలిపింది. సగటున ఒక కస్టమర్ నెలకు 716 నిమిషాల వాయిస్ కాల్స్ చేయగా, 13.8 గంటల నిడివి ఉన్న వీడియోలను చూసినట్లు జియో తెలిపింది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Subscribers Getting 8GB of Additional Data With New Cricket Teaser Pack More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X