Just In
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- News
బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జియో 8జిబి డేటా ఉచితం,ఎటువంటి పరిమితులు లేవు !
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లకు మరో బంపరాఫర్ ని ప్రకటించింది. దిగ్గజాలను సవాల్ చేస్తే తమ యూజర్లకందరికీ అదనంగా డేటాను అందిస్తోంది. అది ఉచితంగా ఎటువంటి పరిమితులు లేకుండా ఈ డేటాను అందిస్తోంది. ఐపీఎల్ అభిమానులకోసం జియో ఈ ఆఫర్ ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న ప్రతి వినియోగదారుడికి 8 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలాంటి లింక్‌ను విజిట్ చేయాల్సిన పనిలేదు. ఏ ప్యాక్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. జియో 8జీబీ డేటాను ఆటోమేటిక్‌గా కస్టమర్ల అకౌంట్లకు యాడ్ చేసింది. మరి ఎలా పొందాలో చూద్దామా..
గత వారం వ్యవధిలో జియో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లు ఇవే !

మైజియో యాప్‌లోకి..
ఈ ఉచిత డేటా కావాలంటే ఎవరైనా మైజియో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు యాడ్ అయిన 8జిబి జియో డేటా కనిపిస్తుంది. అయితే ఈ ఈ డేటా మీకు క్రికెట్ ప్యాక్ కింద యాడ్ అయి ఉంటుంది. ఓ సారి వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

జియో టీవీ యాప్ ద్వారా..
కాగా జియో టీవీ యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను వీక్షించే వెసులుబాటును జియో కల్పించిన విషయం విదితమే. దీంతోపాటు అనేక చానల్స్‌ను కూడా ఆ యాప్‌లో చూసేందుకు వీలుంది. ఈ క్రమంలోనే నాణ్యమైన ప్రసారాలను, సేవలను అందిస్తున్నందున జియో టీవీ యాప్‌కు బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్ అవార్డు వచ్చింది.

జీఎస్ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో..
జీఎస్ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో భాగంగా జియో ఈ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో జియో అందుకు బహుమతిగా 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా యాడ్ చేసినట్లు వెల్లడించింది.

2జీబీ చొప్పున 4 రోజుల్లో..
అయితే ఈ డేటాను రోజుకు 2జీబీ చొప్పున 4 రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుంది.4 రోజుల తర్వాత ఈ డేటా ఆటోమేటిగ్గా మాయమైపోతుంది.

ఈ ఏడాది మార్చి వరకు..
కాగా ఈ ఏడాది మార్చి వరకు జియో కస్టమర్ల సంఖ్య ఏకంగా 18.66 కోట్లకు చేరుకుంది. ఇక 2018 జనవరి నుంచి మార్చి నెలల మధ్యలోనే ఏకంగా 2.65 కోట్ల మంది కొత్త కస్టమర్లు జియోలో చేరినట్టు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య..
ఇక ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల మధ్య మొత్తం జియో కస్టమర్లు వాడుకున్న డేటా 506 కోట్ల జీబీ అని జియో తెలిపింది. అంటే సగటున ఒక్కో వినియోగదారుడు నెలకు 9.7 జీబీ డేటాను వాడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ మూడు నెలల కాలంలో
అలాగే ఈ మూడు నెలల కాలంలో జియో కస్టమర్లు 37,218 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్ చేశారని జియో తెలిపింది. సగటున ఒక కస్టమర్ నెలకు 716 నిమిషాల వాయిస్ కాల్స్ చేయగా, 13.8 గంటల నిడివి ఉన్న వీడియోలను చూసినట్లు జియో తెలిపింది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790