జియో యూజర్లకు షాక్.. రూ.69, రూ.139 ప్లాన్‌ల వ్యాలిడిటీల్లో భారీ కోత!
Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లైన రూ.69, రూ.139 ప్లాన్‌ల వ్యాలిడిటీని మార్చేసింది. ఇంతకుముందు ఈ ప్లాన్లు బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత కాలం పనిచేసేవి. అంటే మెయిన్ ప్లాన్ 56 రోజులు వ్యాలిడిటీ ఉంటే, ఈ డేటా ప్లాన్లు కూడా 56 రోజులు పనిచేసేవి. కానీ ఇప్పుడు ఈ రెండు డేటా ప్లాన్లకు ఫిక్స్‌డ్ వ్యాలిడిటీ పెట్టేశారు.
* జియో రూ.69 డేటా ప్లాన్ 6GB డేటా, 7 రోజులే
బేస్ ప్లాన్‌తో సంబంధం లేకుండా, ఇవి కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఈ మార్పు యూజర్లకు చాలా నష్టం చేస్తాయి. రూ.69 ప్లాన్‌లో మొత్తం 6GB డేటా వస్తుంది. కానీ ఇది కేవలం 7 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. ఈ ప్లాన్ వాడాలంటే జియో సిమ్‌లో ఏదో ఒక బేస్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి.

ఒకప్పుడు బేస్ ప్లాన్ వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్, ఇప్పుడు 7 రోజుల్లోనే ఖతం అయిపోతుంది. దీనివల్ల డేటా కొంచెం అవసరం ఉన్నా సరే మళ్లీ పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. వ్యాలిడిటీ పెంచుకోవడం కోసమే డబ్బులు చెల్లించాల్సి రావడం సామాన్యులకు పెద్ద భారం అని చెప్పవచ్చు.
* జియో రూ.139 డేటా ప్లాన్ 12GB డేటా, 7 రోజులే
రూ.139 ప్లాన్‌లో డబుల్ డేటా.. అంటే 12GB డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 7 రోజులే. రూ.69 ప్లాన్ లాగే, ఇది వాడాలంటే కూడా బేస్ ప్లాన్ కంపల్సరీగా ఉండాలి. ఇంతకుముందు బేస్ ప్లాన్ ఎంత కాలం ఉంటే అంత కాలం పనిచేసిన ఈ ప్లాన్‌కు కూడా ఇప్పుడు 7 రోజుల లిమిట్ పెట్టేశారు.
* ఇతర జియో డేటా వోచర్లు
జియో ఇంకా కొన్ని తక్కువ ధర డేటా ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఇవి తక్కువ డేటా కావాలనుకునేవారికి బాగా యూజ్ అవుతాయి. రూ.11 వోచర్ కేవలం ఒక్క గంట మాత్రమే డేటా ఇస్తుంది. అర్జెంట్‌గా కొంచెం డేటా కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. రూ.19 వోచర్ ఒక రోజు వ్యాలిడిటీతో 1GB డేటా ఇస్తుంది.
ఒక రోజు కోసం ఎక్కువ డేటా కావాలంటే ఇది బెటర్. ఈ వోచర్లు దేశవ్యాప్తంగా జియో యూజర్లందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, జియో ఇంతకుముందు ఆపేసిన రూ. 189 ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 300 ఫ్రీ SMSలు కూడా ఇస్తారు. 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది.
డేటా లిమిట్ అయిపోతే స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌ను వాడుకోవచ్చు, కానీ జియో సినిమా ప్రీమియం మాత్రం రాదు. ట్రాయ్ రూల్స్ ప్రకారం జియో కొత్తగా వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను కూడా తెచ్చింది. వీటిలో కాల్స్, SMSలు మాత్రమే ఉంటాయి.
* మొదట్లో రెండు ప్లాన్‌లు రిలీజ్.
రూ.1,958 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు కాగా రూ.458 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఆ తర్వాత జియో వీటి ధరలు తగ్గించింది. రూ.1,958 ప్లాన్ ఇప్పుడు రూ.1,748కి లభిస్తుంది, కానీ వ్యాలిడిటీ 336 రోజులకు తగ్గించారు. రూ.458 ప్లాన్ ఇప్పుడు రూ. 448కి వస్తుంది, వ్యాలిడిటీ మాత్రం మారలేదు.
* జియో చీపెస్ట్ ప్లాన్
జియో అందిస్తున్న ప్లాన్‌లలో రూ.189 ప్లాన్ చాలా చౌకైనది. దీని తర్వాత చౌకైన ప్లాన్ రూ.199. ఇందులో రోజుకి 1.5GB డేటా, రోజుకి 100 SMSలు, 18 రోజుల వాలిడిటీ ఉంటాయి. జియో ముందు ముందు ఇంకా తక్కువ ధర ప్లాన్లను కూడా తీసుకురావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications