ధన్ ధనా ధన్‌కి పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్
భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో కురిపిస్తోన్న ఆఫర్ల జోరుని తట్టుకొని నిలబడేందుకు ఎయిర్‌టెల్ ఇప్పటికే ఎన్నో ఆఫర్లను గుప్పించిన విషయం తెలిసిందే.
భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో కురిపిస్తోన్న ఆఫర్ల జోరుని తట్టుకొని నిలబడేందుకు ఎయిర్‌టెల్ ఇప్పటికే ఎన్నో ఆఫర్లను గుప్పించిన విషయం తెలిసిందే.తాజాగా ధన్ ధనాధన్ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించిన జియోకి పోటీగా ఎయిర్‌టెల్ అదే స్థాయి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాన్ని ప్రకటించబోతోంది.ఈ కొత్త ప్లాన్ ప్రకారం 4జీ వినియోగదారులు రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్ పొందవచ్చని ప్రముఖ టెలికం బ్లాగర్ సంజయ్ బఫ్నా తెలిపారు.

జియో ఇటీవల ప్రకటించిన ధన్ ధనాధన్ ఆఫర్‌కు పోటీగా రోజుకు 1జీబీ, 2జీబీ డేటా లిమిట్‌తో వేర్వేరు ప్లాన్లు ప్రకటించాలని కూడా ఎయిర్‌టెల్ యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నుంచి ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు గానీ, టెలికం రంగానికి సంబంధించి కచ్చితమైన లీకులు ఇవ్వడంలో బఫ్నాకు మంచి రికార్డు ఉంది. దాంతో ఈ కొత్త ప్లాన్ల విషయంలో కూడా ఆయన చెప్పింది కరెక్టే కావచ్చని అంటున్నారు.
గాడ్జెట్స్ ఎంత సెక్సీగా ఉంటాయంటే..?

హ్యాపీ న్యూ ఇయర్
పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ అంటూ రూ. 549, రూ. 799 రీచార్జ్ తో అపరిమిత కాల్స్, డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది.

రూ. 549 ప్లాన్
రూ. 549 ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. దీంతో పాటు నెలకు వింక్ మ్యూజిక్, మూవీ సేవలు కూడా అందుతాయి. అంతేకాకుండా రోజుకు 100 లోకల్, నేషనల్ ఎసెమ్మెస్ లు పంపుకోవచ్చు. 3జీబి 4జీ డేటా లభిస్తుంది. అదే 3జీ ఫోన్ యూజర్లకయితే 1జిబి 3జీ డేటా లభిస్తుంది.

రూ. 799 ప్లాన్
రూ. 799 ప్లాన్ లో కూడా రూ. 549 ప్లాన్ లో లభించినట్లు అన్ని సేవలు లభిస్తాయి. అయితే ఇందులో అదనంగా 5జీబి 4జీ డేటా లభిస్తుంది. అదే 3జీ యూజర్లకయితే 2జిబి 3జీ డేటా లభిస్తుంది.

పాత ఆఫర్ తో కొత్త ఆఫర్లను పోల్చి చూస్తే
కంపెనీ ఇప్పటికే రూ. 1199 ప్లాన్ తో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ తో కొత్త ఆఫర్లను పోల్చి చూస్తే చాలా ఎక్కువ ఫ్రయోజనం కలిగిస్తాయని కంపెనీ చెబుతోంది. కొత్త ఆఫర్లలో వింక్ మ్యూజిక్ తో పాటు సినిమాలు కూడా చూసే సౌలభ్యం ఉంది.

ఫీచర్ లో ఇంకా సరికొత్త ప్లాన్లను
అయితే ఎయిర్‌టెల్ ఫీచర్ లో ఇంకా సరికొత్త ప్లాన్లను తీసుకురానుందని తెలుస్తోంది. రూ. 1199 ప్లన్ లోనే డేటాను పెంచే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇది 15జిబి, 20 జిబి, 30 జిబి వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ జిబిల ధరలు ఇప్పుడు రూ. 1,599, రూ. 1,999, రూ. 2,999 గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications