డౌన్‌లోడ్ స్పీడులో టెలికాం మార్కెట్‌ని షేక్ చేస్తున్న జియో
దేశీయ టెలికాం రంగంలో ఓ సునామికి జియో తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే . ఈ జియో దెబ్బకు టాప్ దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలలోకి జారుకున్నాయి .
దేశీయ టెలికాం రంగంలో ఓ సునామికి జియో తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే . ఈ జియో దెబ్బకు టాప్ దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలలోకి జారుకున్నాయి . ఇప్పటికీ ఆ నష్టాల నుంచి బయటపడలేక విలవిల్లాడుతున్నాయి . ఇదిలా ఉంటే రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ మొబైల్ డేటాను అందివ్వడంలోనూ ఇప్పటికీ ముందుందని ట్రాయ్ రిపోర్టు పేర్కొంది.

ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం :
ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం డౌన్లోడ్ స్పీడ్ అందిచడంలో జియో మొదటి స్థానంలో ఉండగా ఎయిర్టెల్ రెండో స్థానంలో కొనసాగుతుంది వొడాఫోన్ మరియు ఐడియా విషయానికి వస్తే మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

జియో రికార్డు స్థాయిలో..
జూన్ లో జియో రికార్డు స్థాయిలో 22.3 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో అగ్రస్థానంలో నిలవగా అదే నెలలో అప్‌లోడింగ్ వేగంలో ఐడియా సెల్యులార్ 5.9 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

డౌన్‌లోడ్ వేగంలో..
డౌన్‌లోడ్ వేగంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యూలార్‌లు వరుసగా 9.7, 6.7, 6.1 ఎంబీపీఎస్ వేగంతో జియో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి.

అప్‌లోడ్ వేగంలో..
అప్‌లోడ్ వేగంలో ఐడియా తర్వాత వొడాఫోన్ ,జియో,ఎయిర్‌టెల్ వరుసగా 5.3, 5.1, 3.8 ఎంబీపీఎస్‌తో ఆ తర్వాతి స్థానాలకు పరిమితమయ్యాయి.

మే నెలలో జియో..
మే నెలలో జియో 19 ఎంబీపీఎస్ నమోదు చేయగా, ఎయిర్‌టెల్ వేగం 9.3 ఎంబీపీఎస్‌లకు పెరిగింది.అయితే వొడాఫోన్ 6.8 ఎంబీపీఎస్,ఐడియా 6.1 ఎంబీపీఎస్ స్పీడ్ కు తగ్గిపోయాయి.

ఐడియా మరియు ఎయిర్టెల్ వేగం తగ్గిపోయింది ..
మే తో పోలిస్తే జూన్ నెలలో ఐడియా మరియు ఎయిర్టెల్ అప్‌లోడ్ వేగం పడిపోయింది.మే లో ఐడియా 6.8 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేయగా , ఎయిర్టెల్ 6.5 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








