జియోకి ఎయిర్‌సెల్‌ నుంచి కౌంటర్ అటాక్..

Written By:

జియో ప్రకటించిన ప్లాన్లకు అప్పుడే ప్రత్యర్థుల నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి జియో కొత్త ప్లాన్‌ రూ.399కు పోటీగా తమ ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌సెల్‌ తమ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌ రూ.348ను తమ యూజర్లకు అందిస్తున్నట్టు పేర్కొంది.

భూమి అంతం తప్పదు, కొత్తది వెతుక్కోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోజుకు 1జీబీ డేటా

దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది.

జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ

ఎయిర్‌ సెల్‌ తాజాగా ప్రకటించిన ఈ ప్యాక్‌, ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది.

తమ కొత్త ప్లాన్‌ కింద


జియో యూజర్లు కూడా తమ కొత్త ప్లాన్‌ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవడానికి వీలుంది.

ఎఫ్‌ఆర్‌సీ 348 ప్రస్తుతం

ఎయిర్‌సెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్యాక్‌ ఎఫ్‌ఆర్‌సీ 348 ప్రస్తుతం ఉత్తర యూపీలో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది.

ఏ నెట్‌వర్క్‌కైనా 84 రోజుల పాటు

ఈ ప్యాక్‌ కింద యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌(లోకల్‌, ఎస్‌టీడీ) చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్‌ స్పీడు 3జీ మాత్రమే. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్‌సెట్ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ యూపీ(ఈస్ట్‌) సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ గుప్తా తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: Aircel Offers 84GB Data, Unlimited Calls With New Rs. 348 Pack Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot