జియో ఎఫెక్ట్ , ఎయిర్‌సెల్ పరిమితి లేని ఆఫర్

Written By:

జియో ఎఫెక్ట్ తో అన్ని టెల్కోలు ఇప్పుడు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌సెల్ రూ.333తో కొత్త డేటా ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తను ఆఫర్‌ చేసే ప్లాన్‌లతో ఎంతో ఉన్నతమైన ప్లాన్‌గా దీన్ని అభివర్ణించింది. దీనిపై ఓ లుక్కేయండి.

ఈ ఫోన్‌కి హైలెట్ కెమెరానే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.333 ప్యాక్‌పై

ఎయిర్‌సెల్‌ అందిస్తున్న రూ.333 ప్యాక్‌పై యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రోజువారీ వాడక పరిమితులు లేవు.

కర్ణాటక ప్రాంత ప్రజలకు

అయితే ఈ ఆఫర్‌ ప్రస్తుతం కర్ణాటక ప్రాంత ప్రజలకు మాత్రమే కంపెనీ ప్రకటించింది. ఇంకా అన్ని రాష్ట్ర కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం లేదు.

3జీ స్పీడుకు

2జీ, 3జీ, 4జీ హ్యాండ్‌సెట్‌ ఉన్న ఎయిర్‌సెల్‌ కస్టమర్లందరికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని, ఈ డేటా ప్లాన్‌ 3జీ స్పీడుకు మాత్రమే పరిమితం చేశామని కంపెనీ తెలిపింది.

ఈ-రీఛార్జ్‌ ద్వారా

ఈ-రీఛార్జ్‌ ద్వారా లేదా USSD - 121333# కు డయల్‌ చేసి ఈ కొత్త ప్లాన్‌ను యూజర్లు యాక్టివేట్‌ చేసుకోవచ్చని చెప్పింది.

ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం

గత వారమే ఈ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రూ.348 ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని 84 రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Effect: Aircel's Rs. 333 Pack Offers 30GB Data for 30 Days With No Daily Limits Read more at GIzbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting