Home
News

168 రోజులు అపరిమితం, Airtel మళ్లీ దుమ్మురేపింది

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ జియోతో Airtel నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ జియోతో Airtel నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది. జియోకి పోటీగా ఈ టెలికాం దిగ్గజం కొత్త కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. 597 రూపాయలతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఆఫర్‌ చేసిన ఈ ప్లాన్‌ కింద దీర్ఘకాలికంగా వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను ఎయిర్‌టెల్‌ అందిస్తోంది.

168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌

168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌

ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు.

10 జీబీ డేటా మాత్రమే

10 జీబీ డేటా మాత్రమే

ఈ ప్లాన్‌ను కేవలం వాయిస్‌ కాల్‌ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని తీసుకొచ్చింది. అయితే డేటా ప్రయోజనాలు అన్ని ప్లాన్లతో పోలిస్తే ఈ ప్లాన్లులో చాలా తక్కువగా ఉన్నాయి. 168 రోజుల వరకు 10 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.

 

దీర్ఘకాలం వ్యాలిడిటీ

దీర్ఘకాలం వ్యాలిడిటీ

ఈ ఉచిత డేటా పరిమితి ముగిస్తే కస్టమర్లు డేటా టాపప్ వేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకంగా ఇది కనిపిస్తోంది.

రూ.995 రీఛార్జ్‌ ప్లాన్‌

రూ.995 రీఛార్జ్‌ ప్లాన్‌

ఎయిర్‌టెల్‌ అంతకముందు కూడా అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో రూ.995 రీఛార్జ్‌ ప్లాన్‌ను లాంచ్‌చేసింది. ఆ ప్లాన్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 1జీబీ డేటాను 180 రోజుల పాటు అందిస్తోంది.

 

ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే

ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే

రిలయన్స్‌ జియో లాంగ్‌ టర్మ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లకు, ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ గట్టి కౌంటర్‌ ఇస్తోంది. కాగా ఈ ప్లాన్ కొన్ని రీజన్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

 

జియో రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌కు డైరెక్ట్‌ పోటీ

జియో రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌కు డైరెక్ట్‌ పోటీ

ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసిన రూ.597 ప్లాన్‌, జియో రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌కు డైరెక్ట్‌ పోటీగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel Rs.597 Prepaid Recharge Plan: Offers Unlimited Calling, 10GB Data for 168 days to take on Jio More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X