ఇండస్ట్రీలో Airtel మరో సంచలనం,అత్యంత తక్కువ ధరకే డేటా ఆఫర్
రిలయన్స్ జియోకు ఎయిర్‌టెల్ గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అయింది. తన ప్లాన్లను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తూ వెళుతోంది.
రిలయన్స్ జియోకు ఎయిర్‌టెల్ గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అయింది. తన ప్లాన్లను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తూ వెళుతోంది. ఇప్పుడు తన పాత పాన్లపై మరింత డేటాను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాత 399 రూపాయల ప్లాన్‌ను సవరించింది. ఈ సమీక్షలో రోజువారీ అందించే డేటా పరిమితిని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు పెంచింది. అంతకముందుకు ఈ డేటా ప్లాన్‌పై రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే ఆఫర్ చేయగా.. తాజాగా రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో రిలయన్స్ జియోకు గట్టి పోటీగా నిలవవచ్చని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

రూ.399 రూపాయల ప్యాక్
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ రూ.399 రూపాయల ప్యాక్ వాలిడిటీ 70 రోజులు. అయితే ఎంపిక చేసిన యూజర్లకు ప్యాక్ వాలిడిటీని కూడా 84 రోజులకు పెంచింది. అంతేకాక రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్‌పై డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది.

1 జీబీ, ఒక్క రూపాయి 97 పైసలకే
కొంతమంది యూజర్లకు ఈ ప్యాక్ వాలిడిటీని, డేటా పరిమితిని పెంచినట్టు టెలికాం టాక్ రిపోర్టు కూడా పేర్కొంది. ఈ లెక్కన 1 జీబీ, ఒక్క రూపాయి 97 పైసలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే అత్యంత తక్కువ ధర.

పరిమిత సంఖ్యలో కస్టమర్లకు
కేవలం పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే కాక, ఓపెన్ ఆఫర్‌గా త్వరలోనే మార్కెట్‌లోని కస్టమర్లందరికీ ప్రవేశపెట్టనున్నట్టు ఎయిర్‌టెల్ చెప్పింది.

రిలయన్స్ జియో
ఇదే ధరలో రిలయన్స్ జియో తన ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. కాగా ఇందులో రోజుకు 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

రూ.299కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్
భారతీ ఎయిర్‌టెల్ రూ.299కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 45 రోజులుగా ఉంది.

ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే
అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి డేటా లభించదు. కేవలం ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనికొచ్చేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు జియోలో రూ.299 ప్లాన్‌కు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్‌టెల్‌కే..
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఎయిర్‌టెల్‌కు మొత్తం 308.6 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 45 లక్షల మంది వచ్చి చేరారు. ఇప్పుడు అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్‌టెల్‌కే ఉన్నారు. మరోవైపు మార్కెట్ షేర్‌లోనూ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications








