జియోని టార్గెట్ చేస్తున్న Airtel రూ. 129 ప్లాన్
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రిలయన్స్ జియో ఎయిర్‌టెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉంది.
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రిలయన్స్ జియో ఎయిర్‌టెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉంది. ఈ నేపధ్యంలోనే ఇరు కంపెనీలు పోటాపోటీ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఇందులో భాగంగానే Airtel కంపెనీ ఇప్పుడు డేటా టారిఫ్‌ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్ సెగ్మెంట్ వైపు మళ్లించింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉచిత డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా అందిస్తుంది. ఇటీవల ప్రకటించిన రూ.219 ప్లాన్ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

రూ. 129 రీఛార్జ్‌తో ..
టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్‌తో కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్‌కాలింగ్ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్‌టెల్ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

219 రూపాయలతో..
కాగా ఇప్పటికే 219 రూపాయలతో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. అంటే మొత్తంగా 39.2జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు.డేటాతో పాటు ‘హలో ట్యూన్' ప్రయోజనాలను, కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఇతర ఆపరేటర్లు..
ప్రస్తుతం ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్రయోజనాలు, ఇతర ఆపరేటర్లు రూ.199 ప్లాన్‌పైనే అందిస్తున్నాయి. కేవలం ఒక్క ప్రయోజనాన్నే ఎయిర్‌టెల్ అదనంగా ఆఫర్ చేస్తోంది. అది అపరిమిత ‘హలో ట్యూన్'. యూజర్లు తమ నెంబర్‌కు ఉచితంగా ఎయిర్‌టెల్ ట్యూన్‌ను యూజర్లు సెట్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో కూడా..
ఎప్పడికప్పుడు తమ నెంబర్లకు కాలర్ ట్యూన్స్‌ను సెట్ చేసుకునే సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఎయిర్‌టెల్ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో కూడా తన సర్వీసులు లాంచ్ చేసినప్పటి నుంచి ‘హలో ట్యూన్' సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌టెల్ కూడా రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 39.2జీబీ డేటా ఆఫర్‌చేస్తున్నప్పటికీ, హలో ట్యూన్ సర్వీసులను ఆఫర్ చేయడం లేదు.

రూ.549, రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను..
ఎయిర్‌టెల్ ఇటీవలే తన రూ.549, రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సమీక్షించింది. సమీక్షించిన రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ డేటాను ఆఫర్ చేస్తుండగా.. రూ.799 ప్లాన్‌పై రోజుకు 4జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కేవలం రూ.49తో కూడా ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








