జియోకి కౌంటర్ ఇచ్చిన ఎయిర్‌టెల్, 75 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

By Anil
|

దేశీయ టెలికాం రంగంలో టారిప్ వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఇందులో భాగంగా దిగ్గజాలన్నీ పోటీపడుతూ ఆఫర్లను తెరమీదకు తెస్తున్నాయి.ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య డేటా వార్ పతాక స్థాయికి చేరింది. అయితే భారతీ ఎయిర్టెల్ తన రూ. 499 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను రివైజ్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా 87.5 % అధిక డేటా ఇందులో తమ చందారులకు ఇస్తున్నట్టు ప్రకటించింది. మైప్లాన్‌ ఇన్ఫినిటీ కింద 'బెస్ట్‌ సెల్లింగ్‌ పోస్టుపెయిడ్‌ ప్లాన్స్‌'లో భాగంగా ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.అయితే ఈ 'బెస్ట్‌ సెల్లింగ్‌ పోస్టుపెయిడ్‌ ప్లాన్స్‌' లో ఇతర పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అయిన రూ.399, రూ.649, రూ .799, మరియు రూ.1,199 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

రూ.499కే 75 జీబీ 3జీ/4జీ డేటా:

రూ.499కే 75 జీబీ 3జీ/4జీ డేటా:

భారతీ ఎయిర్‌టెల్‌ అంతకముందు అమలు చేసిన 499 రూపాయల పోస్టు పెయిడ్‌ప్లాన్‌ను రివైజ్ చేస్తూ మల్లి మార్కెట్లోకి ఆవిష్కరించింది . మైప్లాన్‌ ఇన్ఫినిటీ కింద 'బెస్ట్‌ సెల్లింగ్‌ పోస్టుపెయిడ్‌ ప్లాన్స్‌'లో భాగంగా ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌ కింద ప్రస్తుతం 75జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ప్లాన్‌ కింద కేవలం కస్టమర్లకు 40జీబీ 3జీ, 4జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేసేది. ప్రస్తుతం అదనంగా 25జీబీ డేటాను పెంచేసింది.

డేటా రోల్ ఓవర్ :

డేటా రోల్ ఓవర్ :

ఈ కొత్త ప్లాన్ కింద 75 జీబీ అధిక డేటా,మరియు రోజు అన్‌లిమిటెడ్ కాల్స్, రోమింగ్‌లోనూ ఫ్రీకాల్స్ లభిస్తాయి. అంతే కాకుండా మిగిలిపోయిన డేటాను రోల్ ఓవర్ కూడా చేసుకునే అవకాశం ఎయిర్టెల్ కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది.

రూ.499 ప్లాన్ తో  ఇతర ప్రయోజనాలు:
 

రూ.499 ప్లాన్ తో ఇతర ప్రయోజనాలు:

రూ. 499 ప్యాక్ తో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్టెల్ చందాదారులు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను ఒక సంవత్సరం ఉచితంగా పొందవచ్చు. రూ. 499 అపరిమిత ప్లాన్ Wynk TV సబ్స్క్రిప్షన్, లైవ్ TV మరియు సినిమాల లైబ్రరీకి యాక్సెస్ మరియు హ్యాండ్సెట్ డామేజ్ ప్రొటెక్షణ్ ను కూడా పొందవచ్చు.

రూ.499 ప్లాన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే:

రూ.499 ప్లాన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే:

రివైజ్ చేసిన ఈ రూ. 499 ప్లాన్ కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు ఎంచుకోవడానికి అందుబాటులో కనిపిస్తుంది.అయితే రాబోయే రోజులలో విస్తృత రోల్ అవుట్ ను ఊహిస్తుంది అని అయితే ఇతర పోస్ట్పెయిడ్ ప్లాన్స్ మారవు అని కంపెనీ స్పష్టం చేసింది.

జియో vs ఎయిర్టెల్ :

జియో vs ఎయిర్టెల్ :

199 రూపాయల ప్లాన్‌ను రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌పై 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత రోమింగ్‌ను ఆఫర్‌ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Jio Effect: Airtel Rs. 499 Postpaid Plan Now Offering 75GB of Data.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X