జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా లేవు, మళ్లీ టార్గెట్ !
దేశీయ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన అనతికాలంలోనే నంబర్ స్థానాన్ని అటూ ఇటూగా ఉన్న ముఖేష్ అంబానీ ముద్దుబిడ్డ రిలయన్స్ జియో టెల్కోలకు ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది.
దేశీయ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన అనతికాలంలోనే నంబర్ స్థానాన్ని అటూ ఇటూగా ఉన్న ముఖేష్ అంబానీ ముద్దుబిడ్డ రిలయన్స్ జియో టెల్కోలకు ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. వస్తూనే ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియో ఆ తర్వాత టారిఫ్ ప్లాన్లలోనూ అదే జోరును కొనసాగించింది. టారిఫ్ పాన్ల దెబ్బకు కుదేలైన టెల్కోలు కూడా ఆ తర్వాత కోలుకొని జియోకి ధీటుగా ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చాయి. అయినప్పటికీ నష్టాల ఊబి నుంచి బయటపడలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ జియో టెల్కోలకు షాకిచ్చింది. ఈ సారి పోస్ట్ పెయిడ్ విభాగాన్ని టార్గెట్ చేస్తూ జియో టెల్కోలను దెబ్బకొట్టింది.

జియో పెయిడ్ మార్కెట్‌ని టార్గెట్..
తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రిలయన్స్ జియో పెయిడ్ మార్కెట్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ల రేట్లను తగ్గించడానికి సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తోంది.

రెండు నెలల క్రితమే
199 రూపాయల ప్లాన్‌ను గత రెండు నెలల క్రితమే రిలయన్స్ జియో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌పై 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత రోమింగ్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.

ఇతర టెలికాం దిగ్గజాలు సైతం ..
జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో, ఇతర టెలికాం దిగ్గజాలు సైతం తమ రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. వొడాఫోన్ తన డేటా పరిమితులను పెంచడానికి సరికొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించడం ప్రారంభించింది.

వొడాఫోన్ రూ.299 ప్లాన్
జియో ప్లాన్ రూ.199కు పోటీగా వొడాఫోన్ రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చింది. రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్ల కింద రెండు రోజుల క్రితమే దీన్ని ఆవిష్కరించింది. ఈ ప్యాక్‌పై జియో కంటే కాస్త తక్కువగా 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాక అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, 100ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.

పోస్టుపెయిడ్ సెగ్మెంట్‌పై అనాసక్తి
అయితే ఇది కస్టమర్లలో జోష్ ని నింపే సూచనలు కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం పోస్టుపెయిడ్ సెగ్మెంట్‌పై కస్టమర్లకు ఉన్న అనాసక్తినేనని చెప్పవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని కస్టమర్లకు జియో సరికొత్త జోష్‌ను అందిస్తుందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు.

జియో ఎఫెక్ట్‌తో..
కాగా ఇప్పటికే జియో ఎఫెక్ట్‌తో వొడాఫోన్‌తో పాటు, టెలికాం, ఐడియా లాంటి సంస్థలు కూడా తమ పోస్టు పెయిడ్ ప్లాన్లను చౌకైన ధరల్లో ఆఫర్ చేయడం మొదలు పెడతాయని ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








