5 నిమిషాల్లో సిమ్ యాక్టివేషన్, మార్చి 2017 వరకు ఉచితం

సెప్టంబర్ 5న మార్కెట్లో లాంచ్ అయిన రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31, 2016తో ముగుస్తుందనుకున్న నేపథ్యంలో 'జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను రిలయన్స్ జియో గురువారం అనౌన్స్ చేసింది.

5 నిమిషాల్లో  సిమ్ యాక్టివేషన్, మార్చి 2017 వరకు ఉచితం

Read More : ఫోన్‌లో డిలీట్ అయిన మెసెజ్‌లను తిరిగి పొందటం ఎలా..?

డిసెంబర్ 4 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ఉచిత ఆఫర్‌ను మార్చి 31 వరకు అందరు ఉపయోగించుకోవచ్చని ముకేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ జియోను ఉద్దేశిస్తూ దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగించిన ముకేష్ అంబానీ పలు ఆసక్తికర వివరాలను వెల్లండించారు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 కోట్ల యూజర్లు..

మొదటి మూడు నెలల్లో 5 కోట్ల యూజర్లకు చేరువైన రిలయన్స్ జియో... ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్‌ల కంటే వేగంగా విస్తరించింది.

25 రెట్ల డేటా..

సగటు బ్రాడ్‌బ్యాండ్ యూజర్ ఉపయోగించుకుంటోన్న డేటా కంటే 25 రెట్ల డేటాను జియో యూజర్లు ఉపయోగించుకుంటున్నారు.

అందుబాటులోకి eKYC యాక్టివేషన్

eKYC యాక్టివకేషన్ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల రిలయన్స్ అవుట్‌లెట్‌లలో జియో అందుబాటులో ఉంచటం జరిగింది. ఇది ఇంచుమించుగా దేశంలో ఉన్న ఏటీఎమ్‌ల సంఖ్యతో సమానం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

900 కోట్ల వాయిస్ కాల్స్‌ బ్లాక్ చేసారు..

గత మూడు నెలలుగా రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కు సంబంధించి 900 కోట్ల వాయిస్ కాల్స్‌ను మూడు టెలికం ఆపరేటర్లు బ్లాక్ చేసాయి. కాల్ బ్లాక్ రేటు 90% నుంచి 20 శాతానికి తగ్గింది.

హోమ్ డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది..

జియో సిమ్ హోమ్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించటం జరిగింది. eKYC ప్రాసెస్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో సిమ్‌లను యాక్టివేట్ చేయటం జరుగుతుంది. eKYC యాక్టివేషన్ ప్రక్రియతో కూడిన జియో సిమ్‌లు డిసెంబర్ 31, 2016నాటికి 100 నగరాల్లో అందుబాటులో ఉంటాయి.

మార్చి 31, 2017 వరకు ఉచితం..

జియో సబ్‌స్ర్కిప్షన్‌ను స్వీకరించే ప్రతి ఒక్కరికి మార్చి 31, 2017 వరకు జియో డేటా, వాయిస్, వీడియో ఇంకా జియో అప్లికేషన్లను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' పేరుతో ఈ సౌలభ్యతను కల్పిస్తున్నాం. 80శాతం జియో యూజర్లు రోజుకు 1జీబి కంటే తక్కువ డేటాను ఖర్చు చేస్తున్నారు.

ప్రధాని నిర్ణయానికి జియో మద్దతు...

డిజిటల్ ఆధారిత, ఆప్టిమల్ క్యాష్ ఎకానమీని ప్రోత్సహించే క్రమంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని జియో అభినందిస్తోంది.

ఆధార్ మైక్రో ఏటీఎమ్స్..

జియో మనీ యాప్ ద్వారా యూజర్ తన బ్యాంక్ ఖతాలోని నగుదు సహాయంతో ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకుగాను ఆధార్ కార్డ్ ఆధారంగా పనిచేసే మైక్రో ఏటీఎమ్‌లను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Extends Welcome offer till 31st March 2017. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot