2 కోట్ల జియో రూ. 500 ఫోన్లు, ఆగస్టు వరకు ఆగాల్సిందే ?

Written By:

జియో ఫీచర్ ఫోన్ పై రోజుకొక న్యూస్ సోషల్ మీడియాలో వస్తోంది. రిలయన్స్‌కు చెందిన జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనుందనే విషయం తెలిసినప్పటి నుంచీ ఆ ఫోన్‌కు గురించిన పలు వార్తలు నెట్‌లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్నా మధ్యే ఈ ఫోన్ ధర రూ.500 ఉంటుందని, ఈ నెల 21వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ వార్షిక సమావేశంలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తారనే వార్తలు రాగా, ఇప్పుడు ఈ ఫోన్ గురించి మరికొన్ని వార్తలు లీకయ్యాయి.

Airtel యుఎస్‌ఎస్‌డి కోడ్స్ లిస్ట్ ఇదిగో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆగస్టు 15 వరకు

రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ జూలై 21వ తేదీన విడుదలైతే వెంటనే మార్కెట్‌లోకి రాకపోవచ్చని అందుకు ఆగస్టు 15 వరకు సమయం పట్టవచ్చని సమాచారం. ఆ తేదీ వరకల్లా 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్‌లోకి తేవాలని జియో భావిస్తున్నట్టు సమాచారం.

త్వరగా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు

ఈ ఫోన్లను త్వరగా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఇప్పటికే జియో చైనాకు చెందిన జెజియాంగ్ టెకెయిన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కొ., షెంజెన్ చైనో-ఇ కమ్యూనికేషన్ కొ, క్రేవ్ అండ్ మెగాఫోన్ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది.

1.8 కోట్ల నుంచి 2 కోట్ల 4జీ ఫీచర్ ఫోన్ల ఆర్డర్లను

అందులో భాగంగానే దాదాపుగా 1.8 కోట్ల నుంచి 2 కోట్ల 4జీ ఫీచర్ ఫోన్ల ఆర్డర్లను సదరు కంపెనీలకు జియో ఇచ్చిందని తెలిసింది.

లైఫ్ బ్రాండ్ పేరిటే

జియో త్వరలో విడుదల చేయనున్న 4జీ ఫోన్‌ను లైఫ్ బ్రాండ్ పేరిటే విక్రయించనున్నట్టు తెలుస్తున్నది.

రూ.80 నుంచి రూ.90 మధ్య ఓ కొత్త ప్లాన్‌

ఈ క్రమంలోనే ఆ ఫోన్‌ను కొనే యూజర్లకు కొత్త జియో సిమ్‌ను ఇవ్వడంతోపాటు రూ.80 నుంచి రూ.90 మధ్య ఓ కొత్త ప్లాన్‌ను అందజేయనుందని తెలిసింది.

మార్కెట్ కూడా పూర్తిగా

ఇక జియో సంస్థ 4జీ ఫీచర్ ఫోన్‌ను తెస్తే దాంతో ఫీచర్ ఫోన్ మార్కెట్ కూడా పూర్తిగా జియో కైవసం అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Feature Phone's Price, Launch Date Leaked; 18-20 Million Units Reportedly Ordered readmore at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot