JioFiber అద్భుతమైన ఆఫర్!! రూ.199లకే 1TB డేటా...

|

ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చిన రిలయన్స్ జియో సంస్థ బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి జియోఫైబర్ పేరుతో ప్రవేశించి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో ఒకటిగా మారింది. బ్రాడ్‌బ్యాండ్ రంగంలో తక్కువ వ్యవధిలోనే జియోఫైబర్ తన యొక్క సర్వీసులతో ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ISP) ఓడించింది. రిలయన్స్ జియో యొక్క బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు 1TB లేదా 1,000GB డేటాను రూ.250 కన్నా తక్కువ ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్ కు సంబందించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ 1TB డేటా ప్లాన్

జియోఫైబర్ 1TB డేటా ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఫైబర్ ఆర్మ్ జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు 1TB డేటాను రూ.199 కు మాత్రమే అందిస్తుంది. అయితే 1TB డేటా 7 రోజుల చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో 100 Mbps వేగాన్ని పొందుతారు. అలాగే ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాను వినియోగించిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 1 Mbps కు తగ్గించబడుతుంది. దీనితో పాటు ఈ ప్లాన్‌తో 7 రోజుల పాటు ఉచిత వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ కు అదనంగా పన్నులు జోడించడంతో దీనిని రూ.234.82 ధర వద్ద పొందవచ్చు.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు మిడ్‌రేంజ్ ఫోన్ బెస్ట్!! ఎందుకో తెలుసా??కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు మిడ్‌రేంజ్ ఫోన్ బెస్ట్!! ఎందుకో తెలుసా??

జియోఫైబర్ డేటా సాచెట్ ప్లాన్ వివరాలు

జియోఫైబర్ డేటా సాచెట్ ప్లాన్ వివరాలు

జియోఫైబర్ అందించే దీనిని ‘డేటా సాచెట్' అని గమనించండి. జియోఫైబర్ వినియోగదారులు కొనుగోలు చేసిన వారి ప్లాన్ అందించే FUP డేటాను వినియోగించిన తర్వాత వినియోగదారులు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. జియోఫైబర్ దాని ప్రతి ప్లాన్‌తో వినియోగదారులకు 3.3TB డేటాను అందిస్తుంది కాబట్టి సగటు ఇంటర్నెట్ అవసరాలున్న వినియోగదారులకు ఈ డేటా సాచెట్ యొక్క ఉపయోగం అవసరం లేదు. సంబంధం లేకుండా ఎవరికైనా FUP డేటా అయిపోతే మరియు కొన్ని రోజులపాటు అధిక డేటా అవసరమైతే కనుక జియోఫైబర్ యొక్క డేటా సాచెట్ ప్లాన్ సంతృప్తికరంగా ఉంటుంది.

వాట్సాప్ 'గ్రూప్ కాలింగ్' కోసం సరికొత్త ఫీచర్‌!! పూర్తి వివరాలు ఇవిగోవాట్సాప్ 'గ్రూప్ కాలింగ్' కోసం సరికొత్త ఫీచర్‌!! పూర్తి వివరాలు ఇవిగో

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

వినియోగదారుడు మొదట కొనుగోలు చేసిన ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పైన మాత్రమే ఈ ‘డేటా సాచెట్' వర్తిస్తుంది. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ సంస్థలు తమ వినియోగదారులకు అలాంటి ప్లాన్ లను ఇవ్వడం లేదు అని గమనించదగిన విషయం. ఒకవేళ ఎయిర్‌టెల్ లేదా బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో నెలవారీ ఎఫ్‌యుపి డేటా అయిపోతే కనుక వారు అలాంటి ఆఫర్‌తో రీఛార్జ్ చేయలేరు.

జియోఫైబర్

జియోఫైబర్ యొక్క డేటా సాచెట్ లోని 1TB డేటాలో ఉపయోగించని డేటా ప్లాన్ గడువు తరువాత ఉపయోగించడానికి అవకాశం ఉండదు. జియోఫైబర్ యొక్క ఫైబర్ కనెక్షన్ గురించి మీకు తెలియకపోతే కంపెనీ వినియోగదారులకు అందించే రెండు ట్రయల్ ప్లాన్‌లలో ఒకదానిని మీరు ఎంచుకోవచ్చు. ఇందులో మొదటి ప్లాన్ 1,500 రూపాయలకు, రెండవది 2,500 రూపాయలకు వస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు వినియోగదారులకు 150Mbps వేగాన్ని అందిస్తున్నాయి. అయితే రూ.2,500 ప్లాన్‌తో OTT ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రూ.1,500 ప్లాన్ లో ఎటువంటి OTT ప్రయోజనాలు అందుబాటులో లేవు.

Best Mobiles in India

English summary
Jio Fiber Data Sachet Plan 2021 Offers 1TB Data at Just Rs.234 Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X