Home
News

జియో ప్రివ్యూ యూజర్లు మైగ్రేషన్ ప్లాన్‌లోకి మారిపోవచ్చు

By Gizbot Bureau

జియో ఫైబర్ యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రివ్యూ ఆఫర్ వాడుతున్న యూజర్లంతా ఈజీగా మైగ్రేషన్ ప్లాన్ లోకి మారిపోవచ్చు. 7 రోజుల వ్యాలిడెటీతో ఈ మైగ్రేషన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. 100Mbps స్పీడ్ తో 50GB వరకు హైస్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది.

యాక్టివేషన్

ఈ ప్లాన్ కు సంబంధించి యాక్టివేషన్ కోసం ఇప్పటికే జియో ఫైబర్ తమ ప్రివ్యూ ఆఫర్ యూజర్లకు SMSల ద్వారా మెసేజ్ పంపుతోంది. ఏడు రోజుల వ్యాలిడెటీ ముగిశాక జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కాస్త మైగ్రేట్ అవుతుంది. తద్వారా అది పెయిడ్ ప్లాన్ కు పూర్తిగా మారిపోతుంది. ఇటీవలే కొత్త జియో ఫైబర్ కస్టమర్లకు ప్రివ్యూ ఆఫర్ రద్దు చేసిన కొద్దిరోజులకే ఈ కొత్త ప్లాన్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

100Mbps స్పీడ్, 50GB వరకు హైస్పీడ్ డేటా

100Mbps స్పీడ్, 50GB వరకు హైస్పీడ్ డేటా

జియో ఫైబర్ మైగ్రేషన్ ప్లాన్ కింద ఏడు రోజుల పాటు 100Mbps స్పీడ్, 50GB వరకు హైస్పీడ్ డేటా పొందవచ్చు. ఈ డేటా లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 1Mbps కు పడిపోతుంది. జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ యూజర్లకు ఈ మైగ్రేషన్ ప్లాన్ ఫ్రీగా అందిస్తోంది జియో ఫైబర్. ప్రత్యేకించి యూజర్లు ఈ మైగ్రేషన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోనే యూజర్లకు యాక్టివేషన్ ప్రాసెస్‌కు సంబంధించి SMSలు పంపిస్తోంది.

 

మైగ్రేషన్ ప్లాన్ కు మారే సమయంలో

మైగ్రేషన్ ప్లాన్ కు మారే సమయంలో

అర్హత కలిగిన యూజర్లు దాన్ని అంగీకరిస్తే సరిపోతుంది. మైగ్రేషన్ ప్లాన్ కు మారే సమయంలో యూజర్ ఏదైనా ప్లాన్ రీఛార్జ్ చేసినా వెంటనే యాక్టివేట్ అయిపోతుందని టెలికం టాక్ తెలిపింది. గత సెప్టెంబర్ నెలలోనే రిలయన్స్ జియో తమ యూజర్లకు ప్రివ్యూ ఆఫర్ ను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రివ్యూ ఆఫర్ యూజర్లంతా పెయిడ్ ప్లాన్లకు మైగ్రేట్ అవుతారని తెలిపింది.

 

పిటిషన్‌ కొట్టివే

పిటిషన్‌ కొట్టివే

ఇదిలా ఉంటే రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఆప్టికల్‌ ఫైబర్, టవర్‌ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్‌) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్‌ జియో ఇన్ఫ్రాటెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్, టవర్‌ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది.

 

 

జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచ్‌

జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచ్‌

ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచ్‌ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్‌ స్కీమ్‌ ప్రకారం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రెడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్‌) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది'' అని ఆదాయపన్ను శాఖ వాదించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Fiber Migration Plan Offer 50GB Data, 7 Days Validity for Preview Offer Subscribers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X