Jio Fiber బంపరాఫర్.. 3 నెలల ప్లాన్స్‌తో హై-స్పీడ్ ఇంటర్నెట్, ఉచితంగా OTT యాప్స్, టీవీ ఛానెళ్లు..!
Jio Fiber 3-month plans : మీకు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ డేటాతో పాటు బోలెడంత వినోదం కూడా ఉచితంగా కావాలా? అయితే జియో ఫైబర్ మీకోసం అదిరిపోయే 3 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్‌తో హై-స్పీడ్ డేటా, అపరిమిత ఇంటర్నెట్ వాడకం, ప్రముఖ OTT యాప్స్‌కు ఉచిత యాక్సెస్, ఇంకా 800కు పైగా టీవీ ఛానెళ్లు లభిస్తాయి.
నెలనెలా రీఛార్జ్ చేసే పని లేకుండా, ఒకేసారి మూడు నెలలకు ప్లాన్ తీసుకునే వారికి ఇవి భలే సౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా, వీటిలో ఒక ప్లాన్ ఏకంగా 100Mbps వేగంతో వస్తుంది. ఇంటర్నెట్‌ను ఎక్కువగా వాడేవారికి, సినిమాలు/షోలు చూసేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

* రూ.599 జియో ఫైబర్ ప్లాన్
కేవలం రూ.599 నెలవారీ ప్లాన్‌ను మూడు నెలలకు కలిపి రూ.1797కే పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మీకు 30Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, ఉచిత వాయిస్ కాలింగ్, 800కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 11 ప్రముఖ OTT యాప్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా వస్తుంది.
సాధారణ ఇంటర్నెట్ వాడకానికి, అప్పుడప్పుడు వినోదం కోసం చూసేవారికి ఇది ఒక అద్భుతమైన ప్లాన్. విద్యార్థులు, చిన్న కుటుంబాలు, లేదా తక్కువ బడ్జెట్‌లో నిరంతరాయ కనెక్టివిటీ కోరుకునే వారికి ఇది డబ్బుకు తగ్గ విలువైన డీల్. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు దీన్ని తప్పనిసరిగా చెక్ చేయాలి.
రూ.888 జియో ఫైబర్ ప్లాన్
ఈ ప్లాన్ ధర మూడు నెలలకు కలిపి రూ.2,664. ఇందులో కూడా 30Mbps వేగం, అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఈ ప్లాన్‌లో ఏకంగా 14 OTT యాప్స్ ఉచితంగా లభిస్తాయి. అంటే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ చూడటానికి ఇంకా ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి.
జియోహాట్‌స్టార్ (jiohotstar) వంటి పాపులర్ యాప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఎక్కువ వినోదం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. మిగిలిన ప్లాన్స్ లాగే ఉచిత కాలింగ్, 800+ టీవీ ఛానెళ్లు కూడా దీనితో వస్తాయి.
* రూ.899 జియో ఫైబర్ ప్లాన్
మీకు ఇంటర్నెట్ స్పీడ్ చాలా ముఖ్యం అనుకుంటే, ఈ రూ.899 ప్లాన్ మీకోసమే. మూడు నెలలకు కలిపి రూ.2697 ధరతో, ఈ ప్లాన్‌లో ఏకంగా 100Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. దీంతో పాటు ఉచిత కాలింగ్, 800+ టీవీ ఛానెళ్లు, 11 OTT యాప్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది.
ఇంటి నుంచి పనిచేసే ప్రొఫెషనల్స్, ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేసేవారు, లేదా ఇంట్లో ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడే కుటుంబాలకు ఈ ప్లాన్ చాలా బాగా సరిపోతుంది. వేగం, వినోదం రెండూ బ్యాలెన్స్‌డ్‌గా కావాలనుకునే వారికి ఇది సరైన ప్యాకేజ్. ఇది కూడా డబ్బుకు తగిన ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
* అన్ని ప్లాన్స్‌లో కామన్‌గా ఏముంది..
పైన చెప్పిన మూడు ప్లాన్స్‌లోనూ 800కి పైగా టీవీ ఛానెళ్లు, ప్రముఖ OTT యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి 11-14 యాప్స్ వస్తాయి. స్పోర్ట్స్, సినిమాలు, పిల్లల కార్యక్రమాలు.. ఇలా అన్నీ రకాల కంటెంట్ ఈ యాప్స్‌లో అందుబాటులో ఉంటుంది. వీటన్నింటికీ అదనంగా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు.
* 3 నెలల ప్లాన్ ఎందుకు ఎంచుకోవాలి..
క్వార్టర్లీ ప్లాన్ తీసుకోవడంతో మూడు నెలలకు ఒకేసారి చెల్లిస్తే సరిపోతుంది. నెలనెలా రీఛార్జ్ చేయాలనే టెన్షన్ ఉండదు. అంతేకాకుండా, సాధారణంగా నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే, ఇలా ఒకేసారి తీసుకుంటే నెలకు అయ్యే ఖర్చు కొంచెం తక్కువగా కూడా ఉండవచ్చు. ఎక్కువ కాలం ప్రయోజనాలు పొందుతూనే, అవసరమైతే మార్చుకోవడానికి వీలుగా ఉండటం దీనిలోని సౌలభ్యం.
* ఈ ప్లాన్స్ ఎవరికి బాగా ఉపయోగపడతాయి..
ఈ జియో ఫైబర్ ప్లాన్స్ ఇళ్లలోని అవసరాలకు, విద్యార్థులకు, ఇంటి నుంచి పని చేసేవారికి చాలా బాగా సరిపోతాయి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరవ్వాలన్నా, జూమ్ మీటింగ్స్‌లో పాల్గొనాలన్నా, HD క్వాలిటీలో సినిమాలు స్ట్రీమ్ చేయాలన్నా, లేదా మామూలుగా టీవీ చూడాలన్నా.. ఈ ప్లాన్స్ అన్ని రకాల డిజిటల్ అవసరాలను తీరుస్తాయి.
నమ్మకమైన స్పీడ్, బోలెడంత OTT కంటెంట్, లైవ్ టీవీ యాక్సెస్.. అన్నీ ఒకే ప్యాకేజీలో లభించడం వల్ల ఇవి తెలివైన, అందుబాటు ధరలో ఉండే అద్భుతమైన ఎంపికలు అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








