Home
News

Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!

జియో సంస్థ జియోఫైబర్ అనే పేరుతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ రంగంలో కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో సుమారు 50 మిలియన్ల వినియోగదారులను సాధించాలనే లక్ష్యంతో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియోఫైబర్ ప్రస్తుతం సబ్-పార్ టారిఫ్ ప్లాన్‌లతో పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.

జియోఫైబర్

ప్రివ్యూ ఆఫర్‌లో భాగమైన జియోఫైబర్ వినియోగదారులు ఈ సేవను డిస్‌కనెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సంస్థ అందిస్తున్న FUP పరిమితి కారణంగా స్థానిక ISP లను ఎంచుకుంటున్నారు. ఏదేమైనా ఒక చిన్న ట్రిక్ ద్వారా జియోఫైబర్ కస్టమర్లు 35 రోజులకు 1,170 రూపాయలు చెల్లించి ప్రతి నెలా 5TB డేటాను పొందవచ్చు.

 

 

బ్రాడ్‌బ్యాండ్

నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పేలవమైన FUP పరిమితిని నివారించడానికి చాలా మంది జియోఫైబర్ వినియోగదారులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం 1TB డేటాను ఒక వారం చెల్లుబాటుతో అందించే జియోఫైబర్ రూ.199 వీక్లీ ప్లాన్ ను ప్రవేశపెట్టినట్లు అందిరికి తెలిసిన విషయమే. దీనిని స్వతంత్ర ప్రణాళికగా కూడా ఆక్టివేట్ చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

జియోఫైబర్ రూ.199 వీక్లీ ప్లాన్ వివరాలు

జియోఫైబర్ రూ.199 వీక్లీ ప్లాన్ వివరాలు

జియోఫైబర్ వినియోగదారుడు రూ.199 వీక్లీ ప్లాన్‌ను ఒక నెలలో ఐదుసార్లు రీఛార్జ్ చేస్తే వారికి పన్నులతో సహా మొత్తం అయ్యే ఖర్చు రూ.1,170 మాత్రమే కానీ వారికి మొత్తంగా 5TB డేటా లభిస్తుంది. జియోఫైబర్ రూ.199ల వీక్లీ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 100 Mbps వేగంతో 1TB లేదా 1000GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. దాని తరువాత FUP వేగం 1 Mbps కు తగ్గించబడుతుంది. ఇంతకుముందు ఇదే ప్లాన్ ఒక వారానికి కేవలం 100GB డేటాను మాత్రమే అందించేది. అయితే 1TB డేటా ప్రయోజనంతో జియో దీన్ని సవరించింది.

 

 

జియోఫైబర్ వీక్లీ ప్లాన్

జియోఫైబర్ యొక్క వీక్లీ ప్లాన్ ను 30 రోజుల కాలానికి లెక్కిస్తే కనుక మీకు అన్ని రకాల పన్నులతో కలిపి 1,053 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే వినియోగదారులు 4.5TB డేటాను ఆస్వాదించవచ్చు. జియోఫైబర్ ఒక వారంలో మరొక ప్లాన్ ను రీఛార్జ్ చేయడానికి వినియోగదారులను అనుమతించనందున వినియోగదారులు ఐదు వారాల పాటు లెక్కించాల్సి ఉంటుంది.

 

 

జియోఫైబర్

100 Mbps పరిమితి వేగంతో జియోఫైబర్ యొక్క రూ.199 వీక్లీ ప్లాన్ నెలవారీ ప్లాన్‌ల కంటే మెరుగైన ఎంపికగా ఉంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు రూ.1,299ల విలువగల జియోఫైబర్ గోల్డ్ ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక దానికి నెలవారీ ఛార్జీలు రూ.1,299 + 18%GST ఖర్చులు కలుపుకొని దానికి ప్రతిగా వారు నెలకు 750GB డేటాను 250mbps వేగంతో పొందుతారు (ఆ తర్వాత మొదటి ఆరు నెలలు డేటా పరిమితి నెలకు 500GB అవుతుంది).

 

 

వీక్లీ ప్లాన్ Vs మంత్లీ ప్లాన్

వీక్లీ ప్లాన్ Vs మంత్లీ ప్లాన్

మీరు స్పష్టంగా చూడగలిగితే FUP పరిమితి అందుబాటులో ఉంది కాబట్టి మీరు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో జీవించగలిగే వ్యక్తి అయితే కనుక రూ.199 ప్లాన్‌ను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. రూ.699 మరియు రూ.849 ప్లాన్లలో ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు రూ.199 వీక్లీ ప్లాన్ ఉత్తమ ఎంపిక. ఈ ఎంపికతో ఉన్న ఏకైక ఇబ్బంది వినియోగదారులు ప్రతి వారం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

 

 

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో 2019 ఆగస్టులో జియో ఫైబర్ టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ రంగంలో పోటీగా చాలా మంది ఉన్నందున ఇది చాలా విమర్శలను అందుకుంది. జియోఫైబర్ తన బ్రాండ్ పేరుతో చాలా అంచనాల మధ్య లాంచ్ అయింది కానీ అది దాని అంచనాలకు మాత్రం చేరుకోలేకపోయింది. ఉదాహరణకు రూ.699 ప్లాన్‌తో కొత్త వినియోగదారులకు జియోఫైబర్ కేవలం 150 జీబీ ఎఫ్‌యూపీ, 100mbps వేగంతో అందిస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌లో 150 జీబీ డేటా పరిమితి, 100mbps వేగంతో రూ.799 ప్లాన్ అందిస్తోంది. అయితే ISP కనీసం 299 రూపాయలు చెల్లించి ప్రతి నెలా అపరిమిత డేటాను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

జియోఫైబర్ యూజర్ బేస్

జియోఫైబర్ యూజర్ బేస్

ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో జియోఫైబర్ యూజర్ బేస్ పెద్దగా కనిపించదు. నవంబర్ 30, 2019 నాటికి జియోఫైబర్ చందాదారుల సంఖ్య 0.83 మిలియన్లు మాత్రమే. రాబోయే నెలల్లో ఎంత పెరుగుదలను చూస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Fiber Rs.199 Weekly Plan Offers 10 Times More Data Than Monthly Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X