Home
News

జియో వర్సెస్ ఎయిర్‌టెల్, ఎంట్రీ లెవల్ వార్ మొదలైంది

By Gizbot Bureau

వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది.ప్రస్తుతం జియో గిగాఫైబర్‌లో 6 ప్రీపెయడ్ ప్లాన్లను అందుబాటులో ఉంచారు. బ్రాంజ్ కేటగిరిలో నెలకు రూ.699కు, సిల్వర్ విభాగంలో నెలకు రూ.849కు, గోల్డ్‌లో రూ.1299కు, డైమండ్ విభాగంలో నెలకు రూ.2499కు, ప్లాటినంలో రూ.3999కు, టైటానియం విభాగంలో నెలకు రూ.8499కు మొత్తం 6 ప్లాన్లను అందిస్తున్నారు. అయితే ఈ శీర్షికలో భాగంగా జియో ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 699, ఎయిర్‌టెల్ వి ఫైబర్ రూ.799 మధ్య గల తేడాలను ఇస్తున్నాం.ఏది బెటర్ అనే దాని మీద ఓ లుక్కేయండి.

Jio Fiber Rs. 699 Bronze Plan

Jio Fiber Rs. 699 Bronze Plan

బ్రాంజ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 100జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు లాంచింగ్ సందర్భంగా మరో 50 జీబీ డేటాను అదనంగా అందిస్తున్నారు. బ్రాంజ్ ప్లాన్ లో కస్టమర్లకు 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.ఇండియాలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌లకు) సదుపాయాలను అందిస్తున్నారు. ఆరు నెలల పాటు అదనంగా 50జిబి డేటా ఈ ప్లాన్ లో లభిస్తుంది. జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తున్నారు. దీంతోపాటు 3 నెలల పాటు జియో సినిమా, జియో సావన్ యాప్‌లకు, ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇందులో యూజర్ రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ లో వేయి రూపాయలు installation cost కింద తీసుకుంటారు. మిగతా అమౌంట్ రూ.1500 కనెక్షన్ వద్దనుకున్నప్పుడు రీఫండ్ చేస్తారు. 

Airtel V-Fiber Rs. 799 Plan

Airtel V-Fiber Rs. 799 Plan

Airtel బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్' ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. installation cost కింద రూటర్ కి రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే బిల్లింగ్ సమయంలో దీన్ని అడ్జెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి యూజర్ల ఇన్ స్టాలేషన్ ఛార్జీలు జీరో ఉంటాయి.

Jio Fiber Or Airtel V-Fiber?

Jio Fiber Or Airtel V-Fiber?

ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పడం కష్టమే. అయితే జియోలో స్పీడ్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బండిల్ ఆఫర్స్ తో కూడిన ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం 1600 నగరాల్లో జియోని పరిచయం చేశారు. ఇది ఇంకా విస్తరించే అవకాశం ఉంది. ఇక ఎయిర్ టెల్ విషయానికి వస్తే బండిల్ ఆఫర్స్ అంతగా అందివ్వడం లేదు. కాబట్టి మీ ఛాయిస్ ఏదనేది మీరు నిర్ణయించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Fiber Rs. 699 Plan Vs Airtel V-Fiber Rs. 799 Plan: Price, Data Benefits, Validity details Compared
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X