దూసుకొస్తున్న జియో బ్రాడ్‌బ్యాండ్!

|

ఇండియన్ టెలికం మార్కెట్లో పెను సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ జియో తన తదుపరి కార్యాచరణలో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను భారత్‌లోకి తీసుకురాబోతోంది. జియో ఫైబర్ పేరుతో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ ఫిక్సుడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను సెప్టంబర్ 2016 నుంచే కంపెనీ పరీక్షిస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రూ.1000 కంటే తక్కువ నెలవారీ ఛార్జీలతో ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను వినియోగదారులకు జియో చేరువ చేయనున్నట్లు తెలుస్తోంది.

 

OTP చెప్పిన పాపానికి రూ.6.98 లక్షలు గోవిందా, మోసాలను అరికట్టండిలా ?OTP చెప్పిన పాపానికి రూ.6.98 లక్షలు గోవిందా, మోసాలను అరికట్టండిలా ?

ఈ ఏడాది చివరి నాటికి అఫీషియల్‌గా..

ఈ ఏడాది చివరి నాటికి అఫీషియల్‌గా..

ఈ ఏడాది చివరి నాటికి అఫీషియల్‌గా అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు 100ఎంబీపీఎస్ వేగంతో లభ్యం కానుందట. ఈ సర్వీసులో భాగంగా VoIP ఫోన్ ద్వారా యూజర్ అన్‌లిమిటెడ్ వాయిస్ అలానే వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుంటుందట. ఇవి కాకుండా, జియో టీవీ యాక్సిస్‌ను కూడా ఈ సర్వీసులో భాగంగా పొందే వీలుంటుందట.

రంగంలోకి భారతీ ఎయిర్‌టెల్..

రంగంలోకి భారతీ ఎయిర్‌టెల్..

రిలయన్స్ జియోకు ప్రధానమైన ప్రత్యర్థిగా భావిస్తోన్న భారతీ ఎయిర్‌టెల్ గత నెలలోనే 300ఎంబీపీఎస్ వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. రూ.2,199 నెలవారీ రెంటల్‌తో ఈ ప్లాన్ లభ్యమవుతోంది. మరోవైపు గురుగ్రామ్‌కు చెందిన ఆపరేటర్ ఒకరు రూ.1,099 నెలవారీ రెంటల్‌తో చౌకైన 100ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నారు. జియో ఆఫర్ చేయబోతోన్న ఫైబర్ సేవలు ఫైబర్-టు-ద-హోమ్ (ఎఫ్‌టీటీ‌హెచ్) మోడల్ క్రింద మార్కెట్లో లభ్యంకానున్నట్లు తెలుస్తోంది.

 

 

 ప్రస్తుతానిక టెస్టింగ్ ఫేజ్‌లో..
 

ప్రస్తుతానిక టెస్టింగ్ ఫేజ్‌లో..

జియో ఫైబర్ సర్వీసులను ప్రస్తుతానికి అహ్మదాబాద్, చెన్నై, జామ్‌నగర్, ముంబై ఇంకా న్యూఢిల్లీ ప్రాంతాల్లో పరీక్షిస్తున్నారు. టెస్టింగ్ ఫేజ్‌లో భాగంగా ఆయా మార్కెట్లలోని వినియోగదారులకు 100ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. జియో ఫైబర్‌ను సెలక్ట్ చేసుకునే చందాదారులకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. జియో టీవీ యాక్సిస్ అన్ని టీవీ ఛానల్స్‌ను వీక్షించే వీలుంటుంది.

సెక్యూరిటీ అమౌంట్ క్రింద రూ.4,500 చెల్లించాలి..

సెక్యూరిటీ అమౌంట్ క్రింద రూ.4,500 చెల్లించాలి..

ఈ నెల ఆరంభంలో రివీల్ అయిన పలు రిపోర్ట్స్ ప్రకారం జియో ఫైబర్ లాంచ్ చేయబోయే ఇనీషియల్ ప్లాన్‌లో భాగంగా 1.1టీబీ వరకు ఉచిత డేటా యూజర్‌కు లభిస్తుందట. జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఆప్ట్ చేసుకునే యూజర్లు రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ క్రింద రూ.4,500 చెల్లించాల్సి ఉంటుందట. నెలవారీ ప్లాన్‌లో భాగంగా 100 ఎంబీపీఎస్ వేగంతో కూడి 100జీబి డేటా ప్రతి నెలా యూజర్‌కు డీఫాల్ట్ గా లభిస్తుంది. ఉచిత డేటాను ఒక్కోసారి 40జీబి చొప్పున 25 టాపప్స్ రూపంలో వినియోగించుకునే వీలుంటుంది.

 

 

కొత్తగా 26.5 మిలియన్ యూజర్లు..

కొత్తగా 26.5 మిలియన్ యూజర్లు..

2018 మొదటి త్రైమాసికానికిగాను జియో చందాదారుల సంఖ్య 186.6 మిలియన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2017 చివరి క్వార్టర్‌కుగాను ఈ సంఖ్య 160.1 మిలియన్గా ఉందట. అంటే ఈ ఏడాదిలో26.5 మిలియన్ మంది యూజర్లు జియో నెట్‌వర్క్‌లో కొత్తగా జాయిన్ అయ్యారు.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio has been testing its Jio Fiber fixed line broadband services since September 2016 and offering free data through preview plans to select users. But now, it has been reported that the telco is set to bring its broadband services to the public at a monthly charge of less than Rs. 1,000.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X