జియో ఫైబర్, AP ఫైబర్ గ్రిడ్ & T-ఫైబర్ పోటీని తట్టుకోగలదా?

|

ఇటీవల బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని టారిఫ్ ప్లాన్ 700 రూపాయల నుంచి మొదలై రూ.10000 వరకూ ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను పొందొచ్చని తెలిపారు. దీంతో పాటు అతి తక్కువ ఖర్చుతో ఫ్రీ వాయిస్ కాల్స్, ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయం.

జియో ఫైబర్, AP ఫైబర్ గ్రిడ్ & T-ఫైబర్ పోటీని తట్టుకోగలదా?

 

ఫస్ట్ డే ఫస్ట్ షో స్క్రీనింగ్స్ అంటే థియేటర్‌లో విడుదలయ్యే సినిమాను ఇంట్లోనే కూర్చుని చూసే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది. దేశ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న రిలయన్స్ జియో ఫైబర్ రెండు తెలుగు రాష్టాలు ఆంధ్ర మరియు తెలంగాణలలో ఎంత వరకు తన సత్తా చాటుతుందో చూడాలి.

జియో ఫైబర్, AP ఫైబర్ గ్రిడ్ & T-ఫైబర్ పోటీని తట్టుకోగలదా?

రెండు తెలుగు రాష్టాలలో జియో ఫైబర్ కు గట్టి పోటీ ఎదురుకానున్నది అది కూడా మరొక టెలికామ్ రంగానికి చెందిన పోటీదారుని నుండి కాకుండా రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు ప్రారంభించిన AP ఫైబర్ గ్రిడ్ మరియు టి-ఫైబర్ నుండి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇంటర్నెట్ జియో ఫైబర్ అందించే ఇంటర్నెట్ లలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో గిగాఫైబర్ రూ.500 చెల్లిస్తే ఇంటర్నేషనల్ కాల్స్:

జియో గిగాఫైబర్ రూ.500 చెల్లిస్తే ఇంటర్నేషనల్ కాల్స్:

ఇంటర్నేషనల్ కాలింగ్ కోసం నెలకు రూ.500 చెల్లిస్తే చాలు. జియో గిగాఫైబర్ Fixed voice calling, fixed line rates పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్లకు Unlimited calling చేసుకోవచ్చు. US, Canada దేశాలకు Unlimited వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. Free voice కాల్స్ మాత్రమే కాదు.. జియో గిగాఫైబర్ సర్వీసు అందించే ప్లాన్స్ యాక్టివేట్ చేసుకుంటే OTT ప్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ల బండెల్ పొందవచ్చు. ఇందులో కొత్తగా రిలీజ్ అయిన మూవీలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

AP ఫైబర్ గ్రిడ్:
 

AP ఫైబర్ గ్రిడ్:

2017 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు APఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సరసమైన ధరలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. AP ఫైబర్ గ్రిడ్ అన్ని ప్లాన్ లు వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్, టెలివిజన్ సర్వీస్ మరియు వాయిస్ కాల్‌ల కోసం టెలిఫోన్ సర్వీస్ వంటివి అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2,464 సబ్‌స్టేషన్లతో 23,800 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా ప్రస్తుతానికి 1.3 కోట్ల ఇళ్లు, 10,000 ప్రభుత్వ కార్యాలయాలు, 50,000 పాఠశాలలు మరియు 5,000 ప్రజారోగ్య కేంద్రాలు AP ఫైబర్ గ్రిడ్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. సామాన్యులకు సైతం హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పొందే విధంగా ఇళ్ళకు కేవలం 149 రూపాయలకే అందిస్తున్నారు.ఈ బేసిక్ ప్లాన్ లో 5GB వరకు 15 Mbps డౌన్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది తరువాత 1 Mbps వద్ద FUP అపరిమిత డేటాను పొందవచ్చు. ఈ బేసిక్ ప్లాన్ కాకుండా మరొక రెండు ప్లాన్లు ఉన్నాయి. అవి స్టాండర్డ్ ప్లాన్ ఇది 399 రూపాయలకు వస్తుంది.ఇది 25GB వరకు 15 Mbps డౌన్‌లోడ్ వేగంతో వస్తుంది. మరొక ప్లాన్ ప్రీమియం ప్లాన్ 599 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది 50GB వరకు 15 Mbps డౌన్‌లోడ్ వేగంతో వస్తుంది. ఈ రెండు ప్లాన్లు కూడా FUP పరిమితి తరువాత 1 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తాయి.

APఫైబర్ గ్రిడ్ సేవలు:

APఫైబర్ గ్రిడ్ సేవలు:

తరువాత సంస్థలు మరియు ప్రైవేట్ కార్యాలయాల ప్లాన్‌ల యొక్క డౌన్‌లోడ్ వేగం 100 Mbps తో 999 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. 999 రూపాయల యొక్క బేసిక్ ప్లాన్ 100Mbps వేగంతో 50GB వరకు అందిస్తుంది ఇది FUP పరిమితి తరువాత 1 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. 1,499 రూపాయల స్టాండర్డ్ ప్లాన్ 100Mbps వేగంతో 100GB వరకు డేటాను ఇస్తుంది FUP పరిమితి తరువాత 2 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. చివరగా ప్రీమియం ప్లాన్ 2,499 రూపాయల వద్ద 100 Mbps వేగంతో 250GB వరకు డాటాను అందిస్తాయి FUP పరిమితి తరువాత 3 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తాయి.

ఇళ్ల కోసం ఈ ప్రణాళికలు అన్ని 250 టెలివిజన్ ఛానెళ్లను ఉచితంగా అందిస్తాయి. వీటితో పాటు అపరిమిత టెలిఫోన్ కాల్‌లను కూడా అందిస్తాయి. APఫైబర్ గ్రిడ్ సేవలు ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాకపట్నం, విజయనగరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి.

T-ఫైబర్:

T-ఫైబర్:

తెలంగాణ ప్రభుతం కూడా టి-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇల్లు, ప్రభుత్వ సంస్థ మరియు ప్రైవేట్ సంస్థలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానించడానికి మరియు వారికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌నెట్ ప్రాజెక్టు కింద బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇళ్ల వరకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి మరియు దాని ప్రయోజనాలను పొందటానికి తెలంగాణ ప్రభుత్వం టి-ఫైబర్‌ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆప్టిక్ ఫైబర్ మరియు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఒక ప్రత్యేక సంస్థను సృష్టించింది. టి-ఫైబర్ తెలంగాణలో 47+ లక్షల గృహాలకు మరియు 1+ లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మొదలైన వాటికి హోమ్ / ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీకి ఫైబర్ను అందిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఫైబర్ నెట్‌వర్క్ 10 జోన్లు (31 జిల్లాలు), 584 మండలాలు, 8778 గ్రామ పంచాయతీలు, 10,128 గ్రామాలలో అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రతిష్టాత్మక మిషన్ భాగీరథ ఆధ్వర్యంలో సృష్టించబడిన ROW , ట్రెంచింగ్ మరియు డక్టింగ్ వంటి మౌలిక సదుపాయాలను టి-ఫైబర్ ప్రభావితం చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నీటి పైపులైన్ మార్గాల్లో అందించబడతాయి. ఇవి ఇప్పటికే మొత్తం రాష్ట్రానికి అందించబడ్డాయి . టి-ఫైబర్ యొక్క లక్ష్యాల సాధనను నిర్ధారించడానికి టి-ఫైబర్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ కోసం లేయర్డ్ టోపోలాజీ ప్రణాళిక చేయబడింది. ఈ నెట్‌వర్క్ 4-100 Mbps వేగంతో ఇళ్లకు మరియు ఆన్-డిమాండ్ 20-100 Mbps వేగంతో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రవైట్ సంస్థలకు పంపిణీ చేయగలదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jio Fiber vs T-Fiber vs AP Fiber Grid Price Availability Plans and Everything you Need to Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X