జియో యూజర్లకు శుభవార్త, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి 

By Gizbot Bureau
|

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. రిలయన్స్ జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులో మరికొన్ని కొత్త ఫీచర్లను జియో రిలీజ్ చేసింది. ఫైబర్ యూజర్లకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 1Gbps వరకు డేటా, ఫ్రీ 4K TV, OTT స్ట్రీమింగ్ యాప్స్, TV వీడియో కాలింగ్ వంటి ఎన్నో సర్వీసులను రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి విదితమే. వీటితో జియో ఫైబర్ అందించే సరికొత్త ఫీచర్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే యూజర్లు ఈ 5 ఫీచర్ల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి.

సపరేట్ Wi-Fi ID 
 

సపరేట్ Wi-Fi ID 

జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే గెస్ట్ యూజర్లు ఈజీగా జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ యాక్సస్ చేసుకోవచ్చు. మీ పాస్ వర్డ్ ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇతరలకు ఇంటర్నెట్ యాక్సస్ ఇవ్వవచ్చు. గెస్ట్ యూజర్లు ఇంటర్నెట్ వాడాలంటే సపరేట్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెస్ట్ యూజర్ కోసం ప్రత్యేకమైన ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ చేసి ఉంటుంది. అదే లాగిన్ వారికి ఇచ్చి ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవచ్చు.

Wi-Fi Mesh 

Wi-Fi Mesh 

రిలయన్స్ జియో ఫైబర్ యూజర్లు తమ ఇంట్లో ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ కార్నర్ లో ఉన్నప్పటికీ మీ డివైజ్ లతో ఎప్పుడైనా సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. 4K కంటెంట్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. నెట్ స్పీడ్ లేదా క్వాలిటీ గాని ఎంతమాత్రం స్పీడ్ తగ్గకుండా అదే స్థాయిలో అందరూ ఒకేసారి ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ ఇంటర్ కమ్ :

స్మార్ట్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ ఇంటర్ కమ్ :

ఈ ఫీచర్ ద్వారా జియో ఫైబర్ యూజర్లు ఇంటర్నెట్ డేటాను తమ ల్యాండ్ లైన్ కనెక్షన్ లేదా స్మార్ట్ ఫోన్లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. హౌసింగ్ సోసైటీ రిసెప్షన్ గా వాడుకోవచ్చు. కమ్యూనికేషన్ కోసం ఏ నెట్ వర్క్ కు అయినా వైర్ లెస్ సిగ్నల్స్ ద్వారా నెట్ వర్క్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫోన్ కాల్స్ లేదా ల్యాండ్ లైన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంటర్ కమ్ కాల్ బటన్ నొక్కితే చాలు.. అందుబాటులో ఉన్న ఫోన్ లేదా ల్యాండ్ లైన్ కాల్స్ చేసుకోవచ్చు.

గేమింగ్ కంట్రోలర్ 
 

గేమింగ్ కంట్రోలర్ 

జియో ఫైబర్ సెట్ టాప్ బాక్సులో గేమింగ్ టెక్నాలజీ ఆప్షన్ ఉంది. జీరో ల్యాటెన్సీ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఆఫర్ చేస్తున్నట్టు జియో ప్రకటించింది. అన్ని పాపులర్ గేమింగ్ కంట్రోలర్స్ కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

జియో ఫైబర్ హోం నెట్ వర్కింగ్ 

జియో ఫైబర్ హోం నెట్ వర్కింగ్ 

జియో ఫైబర్ యూజర్లు తమ వ్యక్తిగత కంటెంట్.. ఫొటోలు, మ్యూజిక్, వీడియోలు, డాక్యుమెంట్లను వివిధ అన్ని డివైజ్ లకు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలోని జియో హోమ్ యాప్ నుంచి యూజర్లు తమ హార్డ్ డ్రైవ్ ను జియో హోం గేట్ వే లేదా జియో STBకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ హార్డ్ డిస్క్ లోని ఫైల్స్ అన్నింటిని ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Fiber: Wi-Fi Mesh, separate broadband ID for guests, other features you may have missed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X