జియో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్‌ ఫోన్, టీవీ రూ.600కే, ఏడాది పాటు ఉచితం

టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమౌతోంది. జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి తెరలేపుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ౖ లెన్‌

|

టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమౌతోంది. జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి తెరలేపుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ౖ లెన్‌ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించ నుంది. ప్రస్తుతం జియో గిగాఫైబర్‌ సేవలను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కంపెనీ పరీక్షిస్తోంది.

జియో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్‌ ఫోన్, టీవీ రూ.600కే, ఏడాది పాటు ఉచితం

ఈ విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంటోంది. గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ అందించవచ్చని సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.

ఉచితంగానే నెలకు 100 జీబీ డేటా

ఉచితంగానే నెలకు 100 జీబీ డేటా

రిలయన్స్ జియో కంపెనీ ఇప్పటికే గిగాఫైబర్ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. ఉచితంగానే నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది.

రూ.4,500

రూ.4,500

వన్‌టైమ్‌ డిపాజిట్‌ కింద రూటర్‌ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్‌ డేటాను 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది.

వచ్చే మూడు నెలల కాలంలో బ్రాండ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్‌ సేవలను సైతం జోడించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్ని సేవలు కూడా ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి.

 

 

 

ఉచిత ఆఫర్‌

ఉచిత ఆఫర్‌

కంపెనీ అధికారికంగా వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్‌ కొనసాగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్‌ చానళ్లను ఇంటర్నెట్‌ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి.

40 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్

40 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్

జియో స్మార్ట్‌ హోమ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి 40 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అందించొచ్చు. దీని కోసం రూ.1,000 చెల్లించాల్సి రావొచ్చు. రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

గిగాఫైబర్ సేవలు

గిగాఫైబర్ సేవలు

ఇదిలా ఉంటే జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తమ ప్రాంతంలో గిగాఫైబర్ సేవలు కావాలనుకునేవాళ్లు https://gigafiber.jio.com/registration వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరికి కంపెనీ అధికారికంగా బుకింగ్ దారులకి త్వరలో మెయిల్స్ పంపించనుందని సమాచారం.

రూ.600 నెలవారీ ప్లాన్‌లో....

రూ.600 నెలవారీ ప్లాన్‌లో....

రూ.600 నెలవారీ ప్లాన్‌లో 600 చానల్స్‌ను ఏడు రోజుల క్యాచర్‌ ఆప్షన్‌తో ఆఫర్‌ చేస్తామని తెలిపాయి. ప్లాన్‌ చార్జీ ఆ తర్వాత రూ.1,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తొలుత 100 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాండ్‌ బ్యాండ్‌ అందిస్తుండగా, తర్వాత ఈ వేగం 1 జీబీపీఎస్‌ వరకు పెంచే అవకాశం ఉందని తెలిపాయి.

ఒకేసారి 1,100 పట్టణాల్లో

ఒకేసారి 1,100 పట్టణాల్లో

దేశవ్యాప్తంగా ఒకేసారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్‌ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్రాండ్‌ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తీసుకురానున్నట్టు చెప్పారు.

Best Mobiles in India

English summary
Jio GigaFiber to Offer Broadband, Landline, TV Combo at Rs. 600 a Month: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X