జియో జిల్ జిల్ జిగా జిగా, ఫైబర్ వచ్చేస్తోంది
దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుంది.
దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుంది. ముఖ్యంగా జియో గిగా ఫైబర్ ఈ ఏడాది అందరి ఇళ్లల్లో కనువిందు చేయనుంది. అన్నీ కుదిరితే మార్చి నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు. దీనిపై ఇప్పటికే అనేక రివ్యూలు కూడా వచ్చాయి. దేశ వ్యాప్తంగా మార్చి నుండి గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అనధికార వర్గాల సమాచారం.

Fibre-to-the-Home (FTTH)
గతేడాది జరిగిన 41వ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ Fibre-to-the-Home (FTTH) broadband సేవలను ఇంటింటికి అందిస్తామని తెలిపిన సంగతి విదితమే. ఫిక్స్ డ్ లైన్ల ద్వారా ఈ సేవలు అందుతాయని తెలిపారు.

50 మిలియన్ల మంది టార్గెట్
కాగా 50 మిలియన్ల మందికి బ్రాండ్ బ్యాండ్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా జియో పనిచేస్తుంది. జియో గగా ఫైబర్ ద్వారా రూటర్ గిగా టీవీ సెటప్ బాక్స్ లాంటవి వినియోగదారులకు అందుతాయి. ఈ జియో గిగా ఫైబర్ రూటర్ ద్వారా ఒకసారి మల్టిపుల్ డివైస్ ల మీద 1జిబిపిఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సర్వీసులను అందుకోవచ్చు.

1100 నగరాలకు విస్తరణ
కాగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద నెట్ వర్క్ గా జియో గిగాఫైబర్ అవతరించనుంది. దేశవ్యాప్తంగా 1100 ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందించడమే లక్ష్యంగా జియో ఛైర్మెన్ ముఖేష్ అంబానీ పావులు కదుపుతున్నారు.

వీటికి సేవలు అందుతాయి
జియో గిగా ఫైబర్ ద్వారా ఫోన్లు, టెలివిజన్, కంప్యూటర్, ఇతర పరికరాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో భాగంగా 1100 నగరాల్లో గిగా ఫైబర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రివ్యూ ఆఫర్
జియో గిగా ఫైబర్ ఆఫర్ ఫస్ట్ కింద మొదటి మూడు నెలలు 100 ఎంబిపిఎస్ స్పీడుతో 1100 జిబి డేటాను అందించనుంది. జియో గిగా ఫైబర్ ఉచిత ఇన్ స్టాలేషన్ కింద అందిస్తుందని సమాచారం. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4500 కింద చెల్లించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








