జియో గిగాఫైబర్ మీ ఏరియాలో ఉందో లేదో చెక్ చేసుకోండి

ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెను సంచలనాలకు తెరతీస్తూ రిలయన్స్ అభివృద్థి చేసిన జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు అఫీషియల్‌గా లభ్యమవుతోంది.

|

ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెను సంచలనాలకు తెరతీస్తూ రిలయన్స్ అభివృద్థి చేసిన జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు అఫీషియల్‌గా లభ్యమవుతోంది. ఈ హైస్పీడ్ నెట్‌వర్క్ కనెక్షన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అఫీషియల్‌గా ఓపెన్ అయ్యాయి. ఈ సర్వీసును వినియోగించు కోవాలనుకుంటోన్న యూజర్లు జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ చెబుతోంది.అయితే ప్రారంభ దశలో, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, జైపూర్, కోల్కతా, ముంబై, వడోదర, మరియు విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలకు సేవలను అందిచబోతుంది.

 

డేటా వాడకంపై వినియోగదారులకు షాకిచ్చిన BSNLడేటా వాడకంపై వినియోగదారులకు షాకిచ్చిన BSNL

రిలయన్స్ జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ను ఇస్తోంది....

రిలయన్స్ జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ను ఇస్తోంది....

రిలయన్స్ జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ను ఇస్తోంది ఇందులో రెండు సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రస్తుత ప్లాన్స్ మరియు అప్
కమింగ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి. ఒక వినియోగదారుడు Jio GigaFiber కవరేజ్ రేంజ్ లో ఉంటే, అప్పుడు వారు దాని కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.వారికి కంపెనీకి ఉచితంగా 90 రోజులు ఆఫర్ ఇస్తారు. మరోవైపు, వినియోగదారులు రూటర్ మరియు జీయో TV కోసం రూ .4,500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి.

 

 

Jio GigaFiber బ్రాడ్ బ్యాండ్  సేవలకు అర్హమైన నగరాల జాబితా ఇదే...
 

Jio GigaFiber బ్రాడ్ బ్యాండ్ సేవలకు అర్హమైన నగరాల జాబితా ఇదే...

- Bangalore
- Chennai
- Pune
- Lucknow
- Kanpur
- Raipur
- Nagpur
- Indore
- Thane
- Bhopal
- Ghaziabad
- Ludhiana
- Coimbatore
- Agra
- Madhurai
- Nashik
- Faridabad
- Meerut
- Rajkot
- Srinagar
- Amritsar
- Patna
- Allahabad
- Ranchi
- Jodhpur
- Kota
- Guwahati
- Chandigarh
- Solapur

 Jio GigaFiber  ఎఫ్టీహెచ్ ప్లాన్స్...

Jio GigaFiber ఎఫ్టీహెచ్ ప్లాన్స్...

రిలయన్స్ Jio GigaFiber ఎఫ్టీహెచ్ ప్లాన్స్ రూ .500 నుంచి రూ .5,500 వరకు ఉన్నాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్ కోసం రిజిస్టర్ అవ్వాలనుకునే యూజర్లు ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోని డెడికేటెడ్ గిగాఫైబర్ పేజీలోకి వెళ్లాలి. సంబంధిత పేజీలోకి వెళ్లి మీ అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత మీరు నమోదు చేసిన వివరాలు ఇంటివా లేక ఆఫీసువా అన్నది టిక్ మార్క్ చేయవల్సి ఉంటుంది.

 

 

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

తరువాత ఓపెన్ అయ్యేలో మరో పేజీలో మీ పేరుతో పాటు ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ రెండు వివరాలను ఎంటర్ చేసిన తరువాత జనరేట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని అంకెలతో కూడిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసిన తరువాత మీ లొకాలిటీని సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ అభ్యర్థన విజయవంతంగా జియో గిగాఫైబర్ విభాగం దృష్టికి వెళుతుంది.

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా హై-స్పీడ్ వై-ఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగాటీవీ అలానే స్మార్ట్‌హోమ్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌ను మీ ఇంట్లో సెటప్ చేసే క్రమంలో కంపెనీ ప్రతినిధులు మీ హోమ్ లేదా ఆఫీసులో ప్రత్యేకమైన జియో గిగా‌రౌటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్‌లను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

 

 

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

పెద్ద స్క్రీన్ టీవీలను ఉపయోగించుకునే వారు గిగాటీవీ సెట్‌-టాప్ బాక్సులను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వారికి వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీంతో వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఈ సెట్-టాప్ బాక్సు ద్వారా 600లకు పైగా టీవీ చానల్స్‌తో పాటు వేలాది సినిమాలు, లక్షలాది పాటలను యూజర్ ఆస్వాదించే వీలుంటుంది. టీవీ స్ర్కీన్ పై జియో టీవీ, జియో సినిమా, జియోటీవీ కాల్, జియో స్మార్ట్ లివ్వింగ్, జియో నెట్ వెలాసిటీ, జియో క్లౌడ్, మీడియాషేర్ ఇంకా జియో స్టోర్ వంటి యాప్స్ అందుబాటులో ఉంటాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్‌ను టీవీకి అనుసంధానించుకుని వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్ హోమ్ సూట్ గుండెకాయిలా నిలుస్తుంది. ఆడియో డాంగిల్, వీడియో డాంగిల్, స్మార్ట్ స్పీకర్, వై-ఫై ఎక్స్‌టెండర్, స్మార్ట్ ప్లగ్, అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా, టీవీ కెమెరా వంటి యాక్సెసరీస్ ఈ సూట్‌లో భాగంగా లభిస్తాయి. గిగాఫైబర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన ఇళ్లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఒక ఇంటిలో సెటప్ చేయటానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Jio GigaFiber coverage area: List of cities eligible for the broadband service.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X