జియో GigaFiberతో పెను సంచలనాలే

న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 2018 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ఇండియన్ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, తన భవిష్యత్ ఆవిష్కరణలకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది.

|

న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 2018 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ఇండియన్ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, తన భవిష్యత్ ఆవిష్కరణలకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది. ముఖ్యంగా 5జీ కనెక్టువిటీ గురించి ఈ టెల్కో ప్రస్తావించింది. తాము తీసుకురాబోతోన్న గిగాఫైబర్, ఇండియన్ స్మార్ట్ హోమ్ ఇకోసిస్టం పై ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతోందని అనేదాని పై సంస్థ సుధీర్ఘ ప్రసంగం చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, దివాళి గిఫ్ట్..ఆపిల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, దివాళి గిఫ్ట్..

పెను సంచలనాలకు తెరతీస్తూ..

పెను సంచలనాలకు తెరతీస్తూ..

ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెను సంచలనాలకు తెరతీస్తూ రిలయన్స్ అభివృద్థి చేసిన జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు అఫీషియల్‌గా లభ్యమవుతోంది. ఈ హైస్పీడ్ నెట్‌వర్క్ కనెక్షన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అఫీషియల్‌గా ఓపెన్ అయ్యాయి. ఈ సర్వీసును వినియోగించు కోవాలనుకుంటోన్న యూజర్లు జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ చెబుతోంది. గత కొంత కాలంగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ సర్వీసు 700ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌లను నమోదు చేయగలిగిందట.

 

 

దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో..

దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో..

ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సంస్థ 41వ యూన్యువల్ జనరల్ మీటింగ్‌లో భాగంగా కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ జియోగిగాఫైబర్ సర్వీసును అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ జాబితాలో మీ ఏరియా కూడా ఉన్నట్లయితే వెంటనే ఈ నెట్‌వర్క్ కనెక్షన్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.

డెడికేటెడ్ గిగాఫైబర్ పేజీలోకి వెళ్లాలి...

డెడికేటెడ్ గిగాఫైబర్ పేజీలోకి వెళ్లాలి...

జియో గిగాఫైబర్ నెట్‌వర్క్ కోసం రిజిస్టర్ అవ్వాలనుకునే యూజర్లు ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోని డెడికేటెడ్ గిగాఫైబర్ పేజీలోకి వెళ్లాలి. సంబంధిత పేజీలోకి వెళ్లి మీ అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత మీరు నమోదు చేసిన వివరాలు ఇంటివా లేక ఆఫీసువా అన్నది టిక్ మార్క్ చేయవల్సి ఉంటుంది.

 

 

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

తరువాత ఓపెన్ అయ్యేలో మరో పేజీలో మీ పేరుతో పాటు ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ రెండు వివరాలను ఎంటర్ చేసిన తరువాత జనరేట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని అంకెలతో కూడిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసిన తరువాత మీ లొకాలిటీని సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ అభ్యర్థన విజయవంతంగా జియో గిగాఫైబర్ విభాగం దృష్టికి వెళుతుంది.

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్స్ సపోర్ట్..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా హై-స్పీడ్ వై-ఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగాటీవీ అలానే స్మార్ట్‌హోమ్ సొల్యూషన్స్ మీకు లభిస్తాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌ను మీ ఇంట్లో సెటప్ చేసే క్రమంలో కంపెనీ ప్రతినిధులు మీ హోమ్ లేదా ఆఫీసులో ప్రత్యేకమైన జియో గిగా‌రౌటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలతో పాటు వీఆర్ గేమ్‌లను కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

 

 

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ ఆపరేట్ చేసుకోవచ్చు..

పెద్ద స్ర్కీన్ టీవీలను ఉపయోగించుకునే వారు గిగాటీవీ సెట్‌-టాప్ బాక్సులను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వారికి వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీంతో వాయిస్ ఆధారంగా టీవీ ఛానల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఈ సెట్-టాప్ బాక్సు ద్వారా 600లకు పైగా టీవీ చానల్స్‌తో పాటు వేలాది సినిమాలు, లక్షలాది పాటలను యూజర్ ఆస్వాదించే వీలుంటుంది. టీవీ స్ర్కీన్ పై జియో టీవీ, జియో సినిమా, జియోటీవీ కాల్, జియో స్మార్ట్ లివ్వింగ్, జియో నెట్ వెలాసిటీ, జియో క్లౌడ్, మీడియాషేర్ ఇంకా జియో స్టోర్ వంటి యాప్స్ అందుబాటులో ఉంటాయి. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ ఇంకా టాబ్లెట్స్‌ను టీవీకి అనుసంధానించుకుని వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.

 

 

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

గిగాఫైబర్కు స్మార్ట్ హోమ్ సూట్ గుండె కాయ లాంటిది..

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్ హోమ్ సూట్ గుండెకాయిలా నిలుస్తుంది. ఆడియో డాంగిల్, వీడియో డాంగిల్, స్మార్ట్ స్పీకర్, వై-ఫై ఎక్స్‌టెండర్, స్మార్ట్ ప్లగ్, అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరా, టీవీ కెమెరా వంటి యాక్సెసరీస్ ఈ సూట్‌లో భాగంగా లభిస్తాయి. గిగాఫైబర్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన ఇళ్లను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఒక ఇంటిలో సెటప్ చేయటానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదని కంపెనీ చెబుతోంది.

 

 

Best Mobiles in India

English summary
Jio GigaFiber: Here’s How Reliance Jio is Planning to Create a Smart Ecosystem for Your Home.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X