Home
News

జియో లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే ? త్వరలోనే ప్రత్యర్థులకు షాక్

దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది.జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుంది.

దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది.జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుంది.జియో ఏదైనా కొత్తగా లాంచ్ చేయాలి అనుకుంటే ప్రతి ఏటా జులై లో జరిగే యూనువల్ జనరల్ మీటింగ్ తరువాతే లాంచ్ చేస్తుంది.2017లో జియో తన మొట్ట మొదటి ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తునట్టు అనౌన్స్ చేసింది.అలాగే 2018లో జియో ఫోన్ 2 తో పాటు జియో గిగా ఫైబర్ సర్వీస్ మరియు జియో స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ ను అనౌన్స్ చేసింది.

jio-gigafiber-jiophone-3-jio-dth-service-expected-to-launch-in-july

అయితే ఇప్పుడు జరగబోయే 42 యాన్యువల్ జనరల్ మీటింగ్ లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏం అనౌన్స్ చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ , జియోఫోన్ 3 మరియు జియో డీటీహెచ్ సర్వీస్ గురించి అనౌన్స్ చేబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి

జియో గిగా ఫైబర్ కమర్షియల్ లాంచ్

జియో గిగా ఫైబర్ కమర్షియల్ లాంచ్

జియో గిగా ఫైబర్ ఈ ఏడాది అందరి ఇళ్లల్లో కనువిందు చేయనుంది.దేశ వ్యాప్తంగా మార్చి నుండి గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు అది డిలే కాబోతున్నట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే జులై నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు.

జియోఫోన్ 3

జియోఫోన్ 3

జియో ఫోన్‌ పేరుతో ఫీచర్ల ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్‌ ధరలో సామాన్యులకు మొబైల్‌ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్‌ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్‌ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియోఫోన్‌ 3 ఫీచర్ల పై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.పుకార్ల ప్రకారం ఈ జియోఫోన్‌ 3 5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్‌ సాఫ్ట్‌వేర్‌తో మార్కెట్లో రానుందని అని తెలుస్తుంది . ఆండ్రాయిడ్‌ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్‌, 64 స్టోరేజ్‌ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది.

 

 

జియో డీటీహెచ్ సర్వీస్

జియో డీటీహెచ్ సర్వీస్

జియో డీటీహెచ్ సర్వీస్ ను కూడా ప్రారంభించనుంది. అతి తక్కువ ప్యాకేజీకే ఎక్కువ టీవి చానెళ్లను అందించనుంది. చాలా తక్కువ ధరకే హై డెఫినిషన్ చానెల్స్ అందించనున్నట్టు సమాచారం. లేటెస్ట్ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్ సర్వీస్ కింద ఈ జియో హోమ్‌ టీవి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

జియో బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్

జియో బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్

ప్రస్తుతం జియో బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుందనే వార్తలు స్పష్టం అయ్యాయి.అయితే జియో ఈ ఫోన్ ను ఈ ఏడాది లాంచ్ చేస్తుందా లేదా వచ్చే ఏడాది లాంచ్ చేయనుందా అనే దాని పై ఎటువంటి క్లారిటీ లేదు .అయితే జియో లవర్స్ మాత్రం ఈ బిగ్ స్క్రీన్ ఫోన్ ఈ ఏడాదే లాంచ్ చేస్తే బాగుంటుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio GigaFiber, JioPhone 3 and Jio DTH service expected to launch in July.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X