జియోకి బిఎస్ఎన్ఎల్ సవాల్, నెలకి 1500 జిబి డేటా

|

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు తన ప్లాన్లను పునఃసమీక్షించడం ప్రారంభించింది. చెన్నై సర్కిల్‌లో తన ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.

 

జియో సామ్రాజ్యం వెనుక కొన్ని రహస్యపు ఒప్పందాలుజియో సామ్రాజ్యం వెనుక కొన్ని రహస్యపు ఒప్పందాలు

1500 జీబీ డేటా..

1500 జీబీ డేటా..

పునఃసమీక్షించిన ప్లాన్ల ప్రకారం రూ.4999 ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ అంతకముందు 1 టీబీ డేటా ఆఫర్‌ చేయగా.. ప్రస్తుతం 1.5 టీబీ వరకు అంటే 1500 జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది.

100 ఎంబీపీఎస్‌ స్పీడు

100 ఎంబీపీఎస్‌ స్పీడు

ఇతర ప్లాన్లపై కూడా ఎఫ్‌యూపీ ప్రయోజనాలను పెంచింది. చెన్నై సర్కిల్‌లో ఎవరైతే, ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 4999 ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్‌ ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారో, వారికి 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 1.5 టీబీ డేటా ఆఫర్‌ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

ఎఫ్‌యూపీ అనంతరం

ఎఫ్‌యూపీ అనంతరం

ఎఫ్‌యూపీ అనంతరం స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. అయితే ఈ టారిఫ్‌లన్నీ కేవలం చెన్నై సర్కిల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 ఉచిత వాయిస్‌కాల్స్‌
 

ఉచిత వాయిస్‌కాల్స్‌

ఈ ప్లాన్‌పై డేటాతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత వాయిస్‌కాల్స్‌ను(బీఎన్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పరిధిలోనూ, బయట నెట్‌వర్క్‌) కూడా అందిస్తోంది. కాగా ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ జియోకు పోటీగా రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లను సమీక్షించిన సంగతి తెలిసిందే.

80 ఎంబీపీఎస్‌ స్పీడు

80 ఎంబీపీఎస్‌ స్పీడు

ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 999 ప్లాన్‌పై 250 జీబీ డేటాను 60 ఎంబీపీస్‌ స్పీడులో అందిస్తుండగా.. రూ.1299 ప్లాన్‌పై 400 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.

యూఎల్‌డీ 1699 ప్లాన్‌పై ...

యూఎల్‌డీ 1699 ప్లాన్‌పై ...

ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 1699 ప్లాన్‌పై 550 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్‌ స్పీడులో... ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 1999 ప్లాన్‌పై 800 జీబీ డేటాను 80 ఎంబీపీఎస్‌ స్పీడులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తుంది. అన్ని ఈ ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్లపై ఉచిత వాయిస్‌ కాల్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది.

జియో గిగాఫైబర్‌పై

జియో గిగాఫైబర్‌పై

ఈ నెల ప్రారంభంలో జియో లాంచ్‌ చేసిన జియో గిగాఫైబర్‌పై 1 బీబీపీఎస్‌ వరకు స్పీడును అందించనుంది. గిగాటీవీ సెటాప్‌-బాక్స్‌లు, స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌ల సాయంతో, టీవీలకు కూడా ఇది పనిచేయనుంది.

ఇతర టీవీలకు, ఫోన్లకు

ఇతర టీవీలకు, ఫోన్లకు

జియో గిగాఫైబర్‌ నెట్‌వర్క్‌లపై గిగాటీవీ ఇతర టీవీలకు, ఫోన్లకు, టాబ్లెట్లకు ఫోన్‌ కాల్స్‌ చేసుకోవడానికి వీలవుతుందని జియో తెలిపింది.

Best Mobiles in India

English summary
BSNL Revises Premium FTTH Broadband Plans to Offer Up to 1.5TB Data at 100Mbps to Combat Jio GigaFiber more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X