మరో విప్లవానికి ముహూర్తం పెట్టిన ముకేష్ అంబానీ

By Gizbot Bureau
|

దేశీయ టెలికాం చరిత్రలో సృష్టించిన రిలయన్స్ జియో నెట్ వర్క్ మరో సంచలనానికి తెర లేపబోతోంది. యూజర్లను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ”జియో గిగా” ఫైబర్‌ త్వరలో పట్టాలెక్కబోతోంది. అధినేత ముకేష్ అంబానీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ సేవలతో ఈ రంగంలో రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Jio GigaFiber to Launch Commercial on August 12: Report

ఆగస్టు 12 నుంచి ఈ మేరకు పూర్తి అధికారికంగా జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో జరగబోయే రిలయన్స్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధికారికంగా ప్రకటన చేయనుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ధరల వివరాలు కూడా వెల్లడించే అవకాశాలున్నాయి.

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ తో జియో గిగా దూసుకురానుందని తెలుస్తోంది. అయితే దీనిపై వినియోగదారులు ఏం ఆశించవచ్చనే దానిపై మాత్రం రిలయన్స్‌ ఎలాంటి సూచన ఇవ్వలేదు. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ద్వారా ప్రస్తుతం సిగ్నల్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా కనెక్షన్‌లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు ఇక మధ్యతరహా పట్టణాలకూ అందనుంది.

గిగా టీవీ లేదా జియో హోం టీవీ

గిగా టీవీ లేదా జియో హోం టీవీ

జియో గిగా ఫైబర్‌తో పాటు టీవీ రంగంలో.. గిగా టీవీ లేదా జియో హోం టీవీని కూడా లాంచ్‌ చేసే అవకాశం ఉంది. అయితే టీవీ పేరును ఇంకా ఖరారు చేయలేదు. గిగా టీవీ అనేది నెలవారీగా సబ్‌స్రైబ్‌ ప్యాకేజీలో ఓ భాగం అవుతుందని, ఇందులో గిగా ఫైబర్‌, ఉచిత ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ కూడా ఉంటుందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

రూ.600 రుసుముపై ఇంటర్నెట్‌

రూ.600 రుసుముపై ఇంటర్నెట్‌

నెలకు రూ.600 రుసుముపై ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ ప్రసార సేవలందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది. దీని ద్వారా 90 రోజుల పాటు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ తో సేవలకు అందిస్తున్నారు. అంతే కాదు నెలవారీ 100 జీబీ డేటా అందిస్తున్నారు. జియో గిగాఫైబర్‌ సేవలను రిఫండబుల్‌ డిపాజిట్‌తో వినియోగించుకోవచ్చు.

ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌

ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌

100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కావాలంటే రూ.4500 డిపాజిట్‌గా చెల్లించాలి. వినియోగదారుడు సర్వీస్‌ అవసరం లేదనుకుంటే తాను చెల్లించిన డిపాజిట్టు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు.ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు ఈ పథకంలో ఉచిత ల్యాండ్‌లైన్‌ ఇస్తున్నారు. ఈ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్‌ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి.

చందాదారులే లక్ష్యంగా ముందుకు

చందాదారులే లక్ష్యంగా ముందుకు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టారీఫ్‌లపై దృష్టి పెట్టడం లేదని, అత్యధిక వినియోగదారులు తనవైపు తిప్పుకునేదానిపై దృష్టిపెట్టినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ - ఐడియా కంపెనీలపై ఒత్తిడిపెం చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జియో వచ్చినప్ప టి నుంచి అన్ని టెలీకాం సంస్థల లాభాలు గణనీయంగా పడి పోయాయి. 2016, సెప్టెంబర్‌లో జియో తీసుకురావడం జరి గిందని, డేటా ప్లాన్‌లు, ఫ్రీ వాయిస్‌ కాల్స్‌, ఫ్రీ మ్యూజిక్‌, సిని మాలతో పాటు మరెన్నో సేవలు అందించడంతో 331.3 మిలి యన్‌ మంది ప్రజలు సబ్‌స్కైబర్లుగా ఉన్నారని జియో ప్రధాన వ్యూహకర్త అన్షుమాన్‌ ఠాకూర్‌ తెలిపారు.

మూడు నెలల కాలంలో

మూడు నెలల కాలంలో

కొన్ని టెలీకాం సంస్థలు పక్కకు తప్పుకోగా, మరికొన్ని ఒకటితో ఒకటి కలిసిపోయాయని చెప్పుకొచ్చారు. జియో ద్వారా ప్రతి ఒక్కరు సగటు ఆదాయాన్ని పొందుతున్నాడు. చందాదారులు భారీగా చేరుకున్న తరువాత జియో తన టారీఫ్‌లను పెంచుతుందని అందరూ భావించారు. మూడు నెలల కాలంలో 24.5 మిలియన్‌ మంది చందాదారులుగా చేరారు. ప్రతి నెలా సగటున 11.4 గిగా బైట్ల డేటాను వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జియో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు.

Best Mobiles in India

English summary
Jio GigaFiber to Launch Commercial on August 12: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X