జియో vs బిఎస్ఎన్ఎల్ vs ఎయిర్‌టెల్, బ్రాడ్‌బ్యాండ్ కింగ్ ఏది ?

రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం రంగం పూర్తిగా మారిపోయింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ దూసుకువచ్చిన జియో టెల్కోలను తీరని దెబ్బ కొట్టింది.

|

రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం రంగం పూర్తిగా మారిపోయింది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ దూసుకువచ్చిన జియో టెల్కోలను తీరని దెబ్బ కొట్టింది. ఉచిత ఆఫర్లతో మొదలైన యుద్ధం ఆ తరువాత అత్యంత తక్కువ ధరలకే డేటా అంటూ మరింతగా వేడెక్కింది. జియో ఆఫర్ల ధాటికి తట్టుకోలేని మిగతా టెల్కోలు కోట్ల నష్టాలు వచ్చినప్పటికీ దానితో పోటీ పడి మరీ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయింది. 41వ వార్షిక సమావేశంలో జియో అధినేత జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను తీసుకొస్తున్నట్లుగా ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 

వాట్సప్ అలర్ట్,తెలియకుండానే మెసేజ్‌లు డిలీట్ అవుతున్నాయివాట్సప్ అలర్ట్,తెలియకుండానే మెసేజ్‌లు డిలీట్ అవుతున్నాయి

ఒక్కసారిగా షాక్

ఒక్కసారిగా షాక్

ఈ ప్రకటనత బ్రాడ్‌బ్యాండ్ రంగంలో అప్పటిదాకా దూసుకుపోతున్న దిగ్గజాలు ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశాయి. దానితో పోటీ పడేందుకు మరింతగా తమ బ్రాడ్‌బ్యాండ్ రంగాన్ని విస్తరించేందుకు పావులు కదుపుతున్నాయ. BSNL Broadband and Airtel V-Fiberలు జియోని ఢీకొట్టేలా సరికొత్తగా వినియోగదారులను అలరిస్తున్నాయి.

జియో ఫైబర్ బ్రాండ్

జియో ఫైబర్ బ్రాండ్

జియో ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం జియోగిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ సేవలను ఆగస్టులో ప్రారంభించిన సంగతి విదితమే. అయితే ఈ గిగా ఫైబర్ బెనిఫిట్స్ ఏంటి, యూజర్లకు ఎటువంటి ప్రయోజనాలు అందనున్నాయి అనే దానిపై భిన్న కధనాలు వచ్చినప్పటికీ కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

జియో ప్రివ్యూ ఆఫర్

అయితే అంచనాల ప్రకారం జియో ప్రివ్యూ ఆఫర్ తో ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింది జియో మూడు నెలల పాటు 100 జిబి డేటాను అందించనుంది. దీని స్పీడే కూడా 100ఎంబిపిఎస్ వేగంతో ముందుకు రానుంది. యూజర్లు ఈ రకమైన ప్లాన్ పొందాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 4,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని కంపెనీ తిరిగి రీఫండ్ చేస్తుందని సమాచారం.

 

 

BSNL Broadband
 

BSNL Broadband

Broadband రంగంలో బిఎస్ఎన్ఎల్ కూడా దూసుకుపోతోంది. రూ. 777 ఆఫర్ కింద యూజర్లకు 500 జిబి డేటాను అందిస్తోంది. కాగా దీని వేగం 50ఎంబిపిఎస్. దీంతో పాటు రూ.1277 ప్లాన్ కింద 1000Mbpsస్పీడుతో 750 జిబి డేటాను అందిస్తోంది. ఈ మొత్తం అయిన తరువాత డేటా వేగం 20 ఎంబిపిఎస్ కి పడిపోతుంది. యూజర్లకు మరో ఉపయోగకర అంశం ఏంటంటే కంపెనీ ఇన్ స్టాలేషన్ ఛార్జీల కింది ఎటువంటి ఛార్జీలను తీసుకోవడం లేదు.

 

 

Airtel V-Fiber

Airtel V-Fiber

Airtel V-Fiber పొందే యూజర్లకు కంపెనీ బంపరాఫర్ ఇస్తోంది. రూటర్ ఉచితంతో పాటు అమెజాన్ ప్రైమ్ స్క్రిప్సన్ న ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.Airtel V-Fiber రూ.799 ప్లాన్ కింద నెలకు 100 జిబి డేటాను 40Mbpsస్పీడుతో అందిస్తోంది. దీంతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు అందుతాయి. ఇక రూ.1299 ప్లాన్ కింద 500 జిబి డేటాను 100Mbps స్పీడుతో అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ ను అందిస్తోంది. ఇదే ఫీచర్లను రూ.1999లో కూడా అందిస్తోంది.

 

 

బెస్ట్ ఏది ?

బెస్ట్ ఏది ?

అయితే ఈ మూడింటిలో ఏది బెస్ట్ అనేదానికి ఖచ్చితమైన కొలమానాలు లేవు. ఇలాంటి ఆఫర్లనే ఇతర టెల్కోలు కూడా అందిస్తున్నాయి. అయితే వీటిలో జియో నుంచి వస్తున్న గిగా ఫైబర్ కొంచెం బెటర్ గా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ప్లాన్ వివరాలు కంపెనీ నుండి అధికారికంగా బహిర్గతం అయితే తప్ప దీని గురించి పూర్తి వివరాలు అందించలేము.

Best Mobiles in India

English summary
Jio GigaFiber vs BSNL Broadband vs Airtel V-Fiber: Plans, price, benefits, and more compared More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X