Home
News

జియోతో పోటీపడే పైబర్ నెట్‌వర్క్‌లు ఇవే

గతేడాది టెలికాం మార్కెట్ ని జియో షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే ఊపులో ఈ ఏడాది కూడా జియో టెలికాం మార్కెట్ తో పాటు ఫైబర్ బ్రాండ్ రంగంలో మరింతగా ముందుకు దూసుకువెళ్ళేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే జియో గిగా ఫైబర్ పేరుతో దేశీయ ఫైబర్ రంగంలో సవాల విసిరేందుకు రెడీ అయింది.

Jio GigaFiber Vs BSNL Vs Airtel V-Fiber: All the differences

మార్చి 2019 నుంచి జియో తన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జియో వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర టెలికం దిగ్గజాలు కూడా జియోతో పోటీపడుతూ మార్కెట్లోకి దూసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. మరి ఇప్పుడు బెస్ట్ ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ భార‌త్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు 35 జీబీ డేటాను కేవ‌లం రూ.1.1 కే 1 జీబీ డేటా చొప్పున అందివ్వ‌నుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌తోపాటు త్వ‌ర‌లో రానున్న రిల‌య‌న్స్ జియో బ్రాడ్ బ్యాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందివ్వ‌నుంది.

ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ గ‌రిష్ట స్పీడ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. కాగా జియో త‌న గిగాఫైబ‌ర్ సేవ‌ల‌ను దేశవ్యాప్తంగా 1400 సిటీల‌లో ప్రారంభించ‌నున్న విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఎయిర్‌టెల్ కూడా ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీగా త‌న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల‌ను మార్చ‌డంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఎత్తున ఆఫ‌ర్ల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.

జియోగిగా ఫైబర్

జియోగిగా ఫైబర్

జియో గిగా ఫైబర్ ఆఫర్ ఫస్ట్ కింద మొదటి మూడు నెలలు 100 ఎంబిపిఎస్ స్పీడుతో 1100 జిబి డేటాను అందించనుంది. జియో గిగా ఫైబర్ ఉచిత ఇన్ స్టాలేషన్ కింద అందిస్తుందని సమాచారం. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4500 కింద చెల్లించాల్సి ఉంది.జియో గిగా ఫైబర్ ద్వారా ఫోన్లు, టెలివిజన్, కంప్యూటర్, ఇతర పరికరాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో భాగంగా 1100 నగరాల్లో గిగా ఫైబర్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ రూ .799 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్...

ఎయిర్‌టెల్ రూ .799 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్...

బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కింద రూ. 799 రీఛార్జ్ తో 500 జీబీ డేటాను పొందవచ్చు .ఈ ప్లాన్ వాస్తవానికి 40 Mbps స్పీడుతో 100 GB FUP నెలవారి డేటా ను కలిగి ఉంటుంది .అదేవిధంగా రూ. 999 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్, ఇది 100 ఎం.బి.బి.ఎస్ స్పీడ్ తో 250 జీబీ డేటా ను కలిగి ఉంటుంది .ఇప్పుడు వినియోగదారులకు 1000 జిబి బోనస్ డేటాను అందిస్తుంది .

రూ. 1,299 రూ .1,999

రూ. 1,299 రూ .1,999

రూ. 1,299 రూ .1,999 రీఛార్జ్ చేసుకున్న వారికి 1000GB డేటా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రూ.1,299 ప్లాన్ 100 ఎంబీబీఎస్ స్పీడ్ తో 500 జీబీ డేటా అందిస్తుంది .మరియు రూ.1,999 ప్లాన్ఎం100Mbps స్పీడ్ప తో పరిమిత FUP అందిస్తుంది .

ఈ కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ఎంచుకునే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు .ఎయిర్టెల్ wynk మ్యూజిక్, ఎయిర్టెల్ టివి వంటి ఓటీటి యాప్స్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ లభించనుంది.


More from GizBot

Best Mobiles in India

English summary
Jio GigaFiber Vs BSNL Vs Airtel V-Fiber: All the differences More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X