Home
News

జియో నుంచి కొత్త ఆఫర్ వచ్చింది

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో మరోసారి తన కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు కొత్తగా యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. అదనంగా రోజుకు మరింత డేటాను అందించేందుకు రెడీ అయింది.

అదనంగా రోజుకు 2 జీబీ డేటా..

అదనంగా రోజుకు 2 జీబీ డేటా..

దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్‌ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట. ఈ అదనపు డేటా పొందడానికి అర్హత ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

2018 జూలై 31 వరకే వాలిడ్‌

2018 జూలై 31 వరకే వాలిడ్‌

మైజియో యాప్‌లో ద్వారా ఆటోమేటిక్‌గా యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిసింది. ఈ యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ 2018 జూలై 31 వరకే వాలిడ్‌లో ఉండనుందని తెలిసింది.

రూ.399 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై

రూ.399 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై

జియో ప్యాక్‌ యాక్టివ్‌తో... ఒకవేళ జియో యూజర్‌ రూ.399 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై రోజుకు 1.5 జీబీ డేటాను పొందుతూ ఉంటే, ఇక నుంచి రోజుకు 2 జీబీ అదనపు డేటాతో, మొత్తం 3.5 జీబీ 4జీ డేటాను పొందనున్నారు.

కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు..

కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు..

ఈ ప్యాక్‌ వాలిడిటీ జూలై 31 వరకు ఉంటుందని తెలిసినప్పటికీ, కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు ఆఫర్‌ చేస్తుందని టెలికాం టాక్‌ రిపోర్టు చేసింది.

జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌

జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌

ఈ నెల ప్రారంభంలోనే రిలయన్స్‌ జియో, జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ కింద పాత ఫీచర్‌ ఫోన్లను ఇచ్చేసి, కొత్త జియోఫోన్‌ను కేవలం రూ.501కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.

రీఫండబుల్‌ సెక్యురిటీ డిపాజిట్‌

రీఫండబుల్‌ సెక్యురిటీ డిపాజిట్‌

ఇది కూడా ఫుల్‌ రీఫండబుల్‌ సెక్యురిటీ డిపాజిట్‌. అయితే ఈ డీల్‌ పొందడానికి ఆరు నెలల పాటు రూ.99 ప్రీపెయిడ్‌ ప్యాక్‌తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సినవసరం ఉంది.

 రూ.594ను..

రూ.594ను..

అయితే ఈ మొత్తం రూ.594ను కూడా ముందే పొందాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.501 ప్లస్‌ రూ.594 అంటే రూ.1095ను చెల్లించి జియోఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయాలి.

Best Mobiles in India

English summary
Jio Giving Users Free 2GB Data per Day With New Jio Digital Pack More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X