Home
News

జియో నుంచి 10 జిబి ఉచిత డేటాను పొందడం ఎలా ?

రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా దూసుకువచ్చి దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా దూసుకువచ్చి దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు సంవత్సరాల పయనంలో జియో ఉచిత ఆఫర్లతో అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. టెలికాం దిగ్గజాలను హడలెత్తిస్తూ ఆఫర్ల సునామికి తెరలేపింది. లాంచే చేసిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో..

సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో..

సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.

మైజియో యాప్‌లోకి వెళ్లి..

మైజియో యాప్‌లోకి వెళ్లి..

మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు.

సెప్టెంబర్ 11 last

సెప్టెంబర్ 11 last

ఈ బంపర్ ఆఫర్ సెప్టెంబర్ 11తో ముగియనుంది.

క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఆఫర్‌

క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఆఫర్‌

క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఆఫర్‌ను రిలయన్స్‌ జియో సంస్థ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఖాళీ డెయిరీ మిల్క్ పేపర్(రాపర్) ఫొటోను మైజియో యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ఉచితంగా 1జీబీ డేటాను యూజర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలపై..

రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలపై..

సెప్టెంబర్‌ 5న రిలయన్స్‌ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో ఎంట్రీ తర్వాత..

జియో ఎంట్రీ తర్వాత..

జియో ఎంట్రీ తర్వాత మొబైల్‌ డేటా వినియోగం ఇండియాలో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారంటే దాని ప్రభావం ఎంతో తెలుుకోవచ్చు.

లాంచ్‌ అయిన నెలల్లోనే..

లాంచ్‌ అయిన నెలల్లోనే..

జియో లాంచ్‌ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్‌ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్‌ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

ప్రతి సెకనుకు ఏడుగురు..

ప్రతి సెకనుకు ఏడుగురు..

ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్‌ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో

4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో

భారత్‌లో ఎల్‌టీఈ కవరేజ్‌ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్‌ చేయబోతుంది.4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్‌ స్పీడ్‌టెస్ట్‌ పోర్టల్‌ వెల్లడించింది.

టారిఫ్‌ ప్లాన్లపై

టారిఫ్‌ ప్లాన్లపై

అన్ని టారిఫ్‌ ప్లాన్లపై జియో ఉచిత అపరిమిత కాలింగ్‌ను ఆఫర్‌ చేసింది. జియో రాక ముందు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్‌ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి.

ప్రస్తుతం 15 రూపాయలకు

ప్రస్తుతం 15 రూపాయలకు

జియో లాంచ్‌ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. జియో లాంచింగ్‌ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్‌ వచ్చేసింది.

జియో దెబ్బకు చాలా కంపెనీలు ..

జియో దెబ్బకు చాలా కంపెనీలు ..

జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్‌ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్‌ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది.

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు..

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు..

జియో ఎంట్రీ అనంతరం, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్‌ బేస్‌ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్‌ అయినప్పటి నుంచి గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు భారత్‌ మోస్ట్‌ యాక్టివ్‌ మార్కెట్‌గా మారింది.

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద ..

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద ..

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్‌ రిటైల్‌ లాంచ్‌ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది.

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ..

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ..

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్‌ పేరుతో కొత్త ఫీచర్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్‌ ఫోన్‌లో హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను కూడా ఆవిష్కరించింది.

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి..

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి..

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్‌ పేరుతో ఫైబర్‌ ఆధారిత వైర్‌లైన్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.

గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో ..

గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో ..

భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీ పలుమార్లు తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Giving Users Up to 10GB Free Data; Here's How the Offer Works more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X